మోటో ఎక్స్@రూ.23,999!
మోటరోలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఎక్స్'ను ఈ రోజు మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. ధర రూ.23,999. మోటరోలా ఎక్స్‌క్లూజివ్ లాంచ్ పార్టనర్ అయిన ఫ్లిప్‌కార్ట్ ఈ సమాచారాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాము 16జీబి వేరియంట్ మోటో ఎక్స్‌ను విక్రయిస్తామని త్వరలో ఇతర వేరియంట్‌లను ప్రవేశపెడతామని సదరు ఇ-కామర్స్ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రస్తుతం బ్లాక్ ఇంకా వైట్ వర్షన్‌లలో మాత్రమే మోటో ఎక్స్‌ను విక్రయించనున్నారు. తక్కిన కలర్ వర్షన్‌లను ఏప్రిల్ రెండవ వారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

మోటో ఎక్స్ కీలక స్సెసిఫికేషన్‌లు:
సింగిల్ సిమ్,
4.7 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
10 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








