మార్చి 19: మోటరోలా మోటో ఎక్స్@ ఫ్లిప్‌కార్ట్

Posted By:

మోటరోలా మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఎక్స్‌క్లూజివ్‌గా ఆవిష్కరించి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచిన ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి 19న ఈ ఆవిష్కరణ ఉండొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, హెచ్‌టీసీ వన్ వంటి అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తూ మోటో ఎక్స్ డివైస్‌ను మోటరోలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ‘మోటో ఎక్స్' కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే.....

మార్చి 19: మోటరోలా మోటో ఎక్స్@ ఫ్లిప్‌కార్ట్

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
10 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఇండియన్ మార్కెట్లో మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,000 వరకు ఉండొచ్చని ఓ అంచనా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot