విపణిలోకి మోటరోలా మోటో ఎక్స్, ధర రూ.23,999

Posted By:

అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో మోటరోలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్మార్ట్ హ్యాండ్‌సెట్ ‘మోటో ఎక్స్' బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా ఈ స్మార్ట్ డివైస్‌ను విడుదల చేసింది. ధర రూ.23,999.

విపణిలోకి మోటరోలా మోటో ఎక్స్, ధర రూ.23,999

5 కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ప్రస్తుతం ఈ డివైస్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో మాత్రమే లభ్యమవుతోంది. భారతీయులకు, మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 16జీబి మెమరీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 32జీబి మెమరీ వర్షన్‌ను త్వరలోనే విడుదల చేస్తారు. ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌‍లను పరిశీలించినట్లయితే.......

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
1.7గిగాహెట్జ్ డ్యుయల్-కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960 ప్రో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
10 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, 3జీ ఇంకా ఎల్టీఈ కనెకట్టువిటీ,
2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటో ఎక్స్‌లో పొందుపరిచిన ప్రీలోడెడ్ ఫీచర్లు: యాక్టివ్ డిస్‌‍ప్లే, టచ్‌లెస్ కంట్రోల్, క్విక్ క్యాప్చర్ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot