200 మెగాపిక్సెల్ కెమెరాతో తొలి మొబైల్‌.. షాకిచ్చేలా Moto X30 Pro ఫీచ‌ర్లు!

|

ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Motorola.. స‌రికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబ‌ల్ మార్కెట్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతోంది. 200 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమ‌రీ కెమెరాతో Moto X30 Pro మోడ‌ల్ మొబైల్‌ను త్వ‌ర‌లోనే వినియోగ‌దారుల ముందుకు తీసుకు రాబోతోంది. ఆగ‌స్టు 2 వ తేదీన కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్క కెమెరా విష‌యంలోనే కాకుండా ఇంకా ప‌లు అప్‌గ్రేడెడ్ ఫీచ‌ర్ల‌ను ఈ మొబైల్‌కు అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 125W GaN ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌ల్పిస్తున్నారు.

 
200 మెగాపిక్సెల్ కెమెరాతో తొలి మొబైల్‌.. షాకిచ్చేలా Moto X30 Pro ఫీచ‌ర

Moto X30 Pro స్మార్ట్‌ఫోన్ 200 MP క్వాలిటీతో ప్ర‌ధాన‌ కెమెరాను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్ అని Motorola ఇటీవల ధృవీకరించింది. Moto X30 Pro స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తుంది. Moto X30 Pro మోడల్ నంబర్ XT2241-1తో TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించబ‌డింది. దీనికి 16GB RAM మ‌రియు 512GB స్టోరేజీ కెపాసిటీలో ల‌భించ‌నుంది. అదనంగా మ‌రో మోడ‌ల్ అయిన‌, Moto S30 Pro మొబైల్ కూడా మోడ‌ల్ నంబ‌ర్ XT2243-2తో TENAAలో జాబితా చేయ‌బ‌డింది.

TENAA లిస్టింగ్ ప్ర‌కారం.. Moto X30 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్ క‌లిగిన‌ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 144Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 16GB RAM| 512GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై ప‌నిచేస్తుంది.

200 మెగాపిక్సెల్ కెమెరాతో తొలి మొబైల్‌.. షాకిచ్చేలా Moto X30 Pro ఫీచ‌ర

200 మెగాపిక్సెల్ కెమెరా:
కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 200 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండింటిలో 50 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 12 మెగా పిక్సెల్ క్వాలిటీలో టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 60 మెగా పిక్సెల్ క్వాలిటీతో హై రిసోల్యూష‌న్ ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4450mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. 125W GaN ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్టును క‌లిగి ఉంది. ఇది నలుపు, నీలం, సియాన్, ఆకుపచ్చ, బంగారం, బూడిద, ఎరుపు, సిల్వ‌ర్‌ మరియు తెలుపు వంటి అనేక క‌ల‌ర్ వేరియంట్లో రావచ్చు.

TENAA లిస్టింగ్ ప్ర‌కారం.. Moto S30 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
TENAA లిస్టింగ్‌లో క‌నిపించిన మ‌రో మోడ‌ల్ ఈ Moto S30 Pro. ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.55 అంగుళాల full-HD (1,080x2,040 pixel) రిసొల్యూష‌న్ క‌లిగిన‌ OLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 144Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Snapdragon 888+ SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 12GB,16GB RAM| 128GB, 256GB, 512GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై ప‌నిచేస్తుంది.

 
200 మెగాపిక్సెల్ కెమెరాతో తొలి మొబైల్‌.. షాకిచ్చేలా Moto X30 Pro ఫీచ‌ర

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4270mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. 68.2W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్టును క‌లిగి ఉంది. నలుపు, నీలం, నీలం, బంగారం, బూడిద, ఎరుపు, సిల్వ‌ర్ మరియు తెలుపు క‌ల‌ర్ వేరియంట్ల‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మోట‌రోలా నుంచి మిడ్ రేంజ్‌లో గ్లోబ‌ల్ మార్కెట్‌లో తాజాగా విడుద‌లైన Moto G32 మొబైల్‌పై కూడా ఓ లుక్కేద్దాం:
Moto G32 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్ గ‌ల‌ LCDడిస్‌ప్లే ను అందిస్తున్నారు. హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 90Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ octa-core MediaTek Helio H35 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

200 మెగాపిక్సెల్ కెమెరాతో తొలి మొబైల్‌.. షాకిచ్చేలా Moto X30 Pro ఫీచ‌ర

ఈ మొబైల్ 4GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రొక‌టి 8 మెగాపిక్సెల్ క్వాలిటీలో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, చివ‌రిది 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ క‌లిగి ఉంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 30W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.2, A-GPS, NFC, USB టైప్-C , 3.5ఎంఎం హెడ్‌సెట్ జాక్‌పోర్ట్ క‌లిగి ఉంది.

ఈ Moto G32 ధ‌ర‌లు:
ఈ Moto G32 ని మిడ్ రేంజ్ ధ‌ర‌లో విడుద‌ల చేశారు. యూరోపియ‌న్ మార్కెట్లో దీని 4G RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర‌ను 209.99 యూరోలుగా నిర్ణ‌యించారు. భార‌త క‌రెన్సీ ప్ర‌కారం దాదాపు రూ.17 వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా. ఇది మిన‌ర‌ల్ గ్రే, స‌టిన్ సిల్వ‌ర్ క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. మోటరోలా త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాటిన్ అమెరికన్ మరియు భారతీయ మార్కెట్లలో కూడా విడుదల చేయనుంది.

Best Mobiles in India

English summary
Moto X30 Pro and Moto S30 Pro Specification Surface after TENNA Listing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X