ఫస్ట్ ఆండ్రాయిడ్ వన్, గూగుల్ ఫైతో వచ్చేసిన Moto X4

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4' ను తాజాగా యుఎస్ మార్కెట్లోకి విడుదల చేసింది

By Hazarath
|

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4' ను తాజాగా యుఎస్ మార్కెట్లోకి విడుదల చేసింది. గూగుల్ కొత్త టెక్నాలజీ ఫైతో పాటు ఆండ్రాయిడ్ వన్ ఫీచర్ తో యుఎస్ మార్కెట్లో ఇది లాంచ్ అయింది. ఇండియాకి ఇది అక్టోబర్ 3న వస్తోంది. అదిరే ఫీచర్లతో పాటు సరికొత్త టెక్నాలజీని ఈ ఫోన్ లో నిక్షిప్తం చేశారు. రూ.25,730 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అక్టోబర్ 5వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఫోన్ పై ఓ లుక్కేయండి.

 

10 ఫోన్లు అమ్ముడైతే 9 ఫోన్లు దానివే ! దుమ్మురేపుతున్న షియోమి10 ఫోన్లు అమ్ముడైతే 9 ఫోన్లు దానివే ! దుమ్మురేపుతున్న షియోమి

 మోటో ఎక్స్4 ఫీచర్లు.

మోటో ఎక్స్4 ఫీచర్లు.

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Amazon Alexa పేరుతో మరో విప్లవాత్మక ఫీచర్

Amazon Alexa పేరుతో మరో విప్లవాత్మక ఫీచర్

IP68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న మోటో ఎక్స్ 4 నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలదు. Amazon Alexa పేరుతో మరో విప్లవాత్మక ఫీచర్ ను ఈ ఫోన్‌తో ఇన్‌బిల్ట్‌గా మోటరోలా అందిస్తోంది. Moto X4 స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్. రియల్ టైమ్ డెప్త్ ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేయగలిగే ఈ కెమెరాతో ల్యాండ్‌మార్క్ సెటప్, ఆబ్జెక్ట్ రికగ్నిషన్, బిజినెస్ కార్డ్ స్కానింగ్, బార్ కోడ్స్ స్కానింగ్, క్యూఆర్ కోడ్స్ స్కానింగ్ వంటి పనులను చక్కబెట్టుకోవచ్చు.

గ్లాస్ ఇంకా మెటల్ కాంబికేషన్‌లో..
 

గ్లాస్ ఇంకా మెటల్ కాంబికేషన్‌లో..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి Moto X4 స్మార్ట్‌ఫోన్ గ్లాస్ ఇంకా మెటల్ కాంబికేషన్‌లో రూపుదిద్దుకుంది. ఫోన్ ముందు వెనుకా భాగాలను గొరిల్లా గ్లాస్ కవర్ చేస్తుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసిన మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.

కెమెరా విభాగం

కెమెరా విభాగం

12 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ ఆటో ఫోకస్ పిక్సల్ టెక్నాలజీ, వైడ్-యాంగిల్ లెన్స్ సపోర్ట్, bokeh ఎఫెక్ట్, ల్యాండ్‌మార్క్ డిటెక్షన్ ఫీచర్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ లో-లైట్ అడాప్టివ్ మోడ్.

క్విక్ స్ర్కీన్ షాట్

క్విక్ స్ర్కీన్ షాట్

మోటో ఎక్స్4 ఫోన్‌కు Amazon Alexa ఫీచర్ మరో ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ వాయిస్ కమాండ్ ఫీచర్‌ను ఫోన్ లాక్ అయి ఉన్నప్పటికి ఉపయోగించుకోవచ్చు. ఇవే కాకుండా మోటో కీ, క్విక్ స్ర్కీన్ షాట్, వైర్‌ లెస్ ఆడియో స్ట్రీమింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

రెండు కలర్ వేరియంట్స్...

రెండు కలర్ వేరియంట్స్...

మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి సూపర్ బ్లాక్, మరొకటి స్టెర్లింగ్ బ్లు. యూరోప్ మార్కెట్లో ఈ ఫోన్ ధర €399 (ఇండియన్ కరెన్సీలో రూ.25,730 ). 

Best Mobiles in India

English summary
Moto X4 gets Android One treatment; India launch on October 3 Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X