మోటో ఎక్స్4 ధర భారీగా తగ్గింది
స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న లెనోవోకు చెందిన మోటోరోలా కంపెనీ తన మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది.
స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న లెనోవోకు చెందిన మోటోరోలా కంపెనీ తన మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది.3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న వేరియంట్లలో, 3జీబీ ర్యామ్ మోడల్‌పై ధర తగ్గించినట్టు తెలిసింది. 20,999 రూపాయలుగా ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.13,999కు అందుబాటులోకి తెచ్చింది. దాదాపు దీని ధరను రూ. రూ.7000 వరకు తగ్గించింది.

3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్..
అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ సైటులో 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ రెండు వేరియంట్లలో ధర తగ్గినట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ ఆ మోడల్స్‌పై 5000 రూపాయల ధర తగ్గించినట్టు వెల్లడైంది.

ఫ్లిప్‌కార్ట్..
ఫ్లిప్‌కార్ట్ 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.15,999కు, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను 17,999 రూపాయలకు అందుబాటులో ఉంచింది.

అసలు ధర
4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 22,999 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే.

అమెజాన్ సైట్‌లో..
మరోవైపు అమెజాన్ సైట్‌లో కూడా మోటో ఎక్స్4 లిస్ట్ అయింది. 3జీబీ వేరియంట్ 13,744 రూపాయలకు, 4జీబీ వేరియంట్ 15,767 రూపాయలకు, 6జీబీ వేరియంట్ 19,998 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి.

మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.


Click it and Unblock the Notifications








