లీకయిన మోటో కొత్త ఫోన్, ధర గురించి తెలిస్తే ..

Written By:

మోటో ఫోన్లు అనగానే చాలామంది తెగ ఆక్తి చూపుతుంటారు. దానికి తగ్గట్లుగానే కంపెనీ కూడా అద్బుతమైన ఫీచర్లతో సరితూగ తగ్గ ధరలతో తమ ఫోన్లను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు అదే వరసలో మరో కొత్త ఫోన్ రాబోతుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ అధికారికంగా లాంచ్‌ కావడానికి ముందే ధర, ఫీచర్లు లీకయ్యాయి. టిప్‌స్టర్‌ రోలాండ్ క్వాండ్ట్ అనే వ్యక్తి దీని ధర వివరాలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు.

జియో ఫోన్ సొంతం చేసుకోవాలనే ఆసక్తి ఉందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సుమారు రూ.26,300 వరకు

మోటోరోలా తీసుకురాబోతున్న అప్‌కమింగ్‌ డివైజ్‌ మోటో ఎక్స్‌4, 32జీబీ వేరియంట్‌ ధర తూర్పు యూరోపియన్‌ మార్కెట్‌లో 350 యూరోలు అంటే సుమారు రూ.26,300 వరకు ఉండొచ్చని లీక్‌చేశారు.

ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

ప్రస్తుతం మోటోరోలా 2015 నుంచి తీసుకొస్తున్న ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ.27వేల మధ్యలో ఉన్నాయి.

ఎక్కువ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో

అంతేకాక ఎక్కువ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ ఇతర వేరియంట్లను కూడా మోటోరోలా లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు క్వాండ్ట్‌ తెలిపారు.

టెక్‌ వర్గాలు అంచనా

ఈ ఫోన్‌ను ఈ వారం మొదట్లో లాంచ్‌చేసిన మోటో జెడ్‌2 ఫోర్స్‌ ఈవెంట్‌లోనే తీసుకొస్తారని టెక్‌ వర్గాలు అంచనావేశాయి. కానీ కేవలం మోటో జెడ్‌2 ఫోర్స్‌ను మాత్రమే కంపెనీ లాంచ్‌ చేసింది.

లీకయిన మోటో ఎక్స్‌ 4 ఫీచర్లు

అల్యూమినియం బాడీ
డ్యూయల్‌ కెమెరా సెటప్‌
12 మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌తో రియర్‌ కెమెరా
ఐపీ68 వాటర్‌ప్రూఫింగ్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 చిప్‌సెట్‌
32జీబీ లేదా 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
4జీబీ ర్యామ్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ నోగట్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto X4 Price Leaks Ahead of Official Launch Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot