Moto X4 లాంచ్ అయ్యింది, ప్రత్యేకతలివే

బెర్లిన్ వేదికగా ప్రారంభమైన IFA 2017 టెక్నాలజీ ట్రేడ్ షో ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని మోటరోలా తన Moto X4 స్మార్ట్‌ఫోన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Read More : Xiaomi సంచలనం, ఇండియాలో 2.5 కోట్ల ఫోన్‌లు అమ్మేసారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎన్నో ప్రత్యేకతలు..

IP68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న మోటో ఎక్స్ 4 నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలదు. Amazon Alexa పేరుతో మరో విప్లవాత్మక ఫీచర్ ను ఈ ఫోన్‌తో ఇన్‌బిల్ట్‌గా మోటరోలా అందిస్తోంది. Moto X4 స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్. రియల్ టైమ్ డెప్త్ ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేయగలిగే ఈ కెమెరాతో ల్యాండ్‌మార్క్ సెటప్, ఆబ్జెక్ట్ రికగ్నిషన్, బిజినెస్ కార్డ్ స్కానింగ్, బార్ కోడ్స్ స్కానింగ్, క్యూఆర్ కోడ్స్ స్కానింగ్ వంటి పనులను చక్కబెట్టుకోవచ్చు.

గ్లాస్ ఇంకా మెటల్ కాంభికేషన్‌లో..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి Moto X4 స్మార్ట్‌ఫోన్ గ్లాస్ ఇంకా మెటల్ కాంభికేషన్‌లో రూపుదిద్దుకుంది. ఫోన్ ముందు వెనుకా భాగాలను గొరిల్లా గ్లాస్ కవర్ చేస్తుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసిన మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.

 

మోటో ఎక్స్ 4 హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్..

ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 3000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లటూత్ 5.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్).

కెమెరా విభాగం

12 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ ఆటో ఫోకస్ పిక్సల్ టెక్నాలజీ, వైడ్-యాంగిల్ లెన్స్ సపోర్ట్, bokeh ఎఫెక్ట్, ల్యాండ్‌మార్క్ డిటెక్షన్ ఫీచర్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ లో-లైట్ అడాప్టివ్ మోడ్.

Amazon Alexa...

మోటో ఎక్స్4 ఫోన్‌కు Amazon Alexa ఫీచర్ మరో ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ వాయిస్ కమాండ్ ఫీచర్‌ను ఫోన్ లాక్ అయి ఉన్నప్పటికి ఉపయోగించుకోవచ్చు. ఇవే కాకుండా మోటో కీ, క్విక్ స్ర్కీన్ షాట్, వైర్‌ లెస్ ఆడియో స్ట్రీమింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

రెండు కలర్ వేరియంట్స్...

మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి సూపర్ బ్లాక్, మరొకటి స్టెర్లింగ్ బ్లు. యూరోప్ మార్కెట్లో ఈ ఫోన్ ధర €399 (ఇండియన్ కరెన్సీలో రూ.30,300). ఇండియన్ మార్కెట్లో ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto X4 with dual cameras, Amazon Alexa and more launched at IFA 2017. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot