స్టన్నింగ్ ఫీచర్లతో మోటో ఎక్స్ 4 వచ్చేసింది, ధర రూ. 20,999

Written By:

అందరూ అనుకున్నట్లుగానే మోటో ఎక్స్ 4 ఇండియాకి వచ్చేసింది. కొద్ది సేపటి క్రితం అట్టహాసంగా జరిగిన వేడుకలో ఈ ఫోన్ ని కంపెనీ విడుదల చేసింది. ఇందులో యూజర్లను ఆకట్టుకునే స్టన్నింగ్ ఫీచర్లతో తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందించారు. దీని ధరను ఇండియాలో కంపెనీ రూ. 20,999గా నిర్ణయించింది.

భారీ బ్యాటరీతో వస్తున్న జియోని M7 Power, 15న ముహూర్తం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటోరోలా మోటో ఎక్స్4 ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ (ముందు, వెనుక), 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

ఫ్రంట్, బ్యాక్ కెమెరాల నుంచి..

ఫ్రంట్, బ్యాక్ కెమెరాల నుంచి వచ్చిన షూట్లకు బ్యాక్ గ్రౌండ్ కలర్ను బ్లర్ చేసుకునే సరికొత్త ఆప్సన్ ఈ ఫోనులో పొందుపరిచారు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ లాంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

అల్యూమినియం బాడీతో..

అల్యూమినియం బాడీతో ఈ ఫోన్‌ పూర్తిగా గ్లాస్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ లుక్ రావడంతో ఫోన్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా ఉంది. ఇందులో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేశారు.

3/4 జీబీ ర్యామ్..

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.20,999, రూ.22,999 ధరలకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా నేటి అర్థ రాత్రి నుంచి ఓపెన్ సేల్‌లో లభ్యం కానుంది.

అలెక్స్ యాప్

మోటో అలెక్స్ యాప్ కూడా ఇందులో ఉంది. సింగిల్ సిమ్ వేరియంట్ అంటూ దీని మీద సోషల్ మీడియాలో వచ్చిర వార్తలను తోచిపుచ్చుతూ డ్యూయెల్ సిమ్ తో ఈ ఫోన్ దూసుకొచ్చింది. దీంతో పాటు అప్పుడే ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రకటించింది. పాత ఫోన్ ఎక్సేంజ్ ద్వారా రూ. 3 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto X4 With Dual Rear Cameras Launched in India, Price Starts at Rs. 20,999 Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot