మోటోరోలా నుంచి స్లిమ్ డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు సహా కీలక వివరాలు!
మోటోరోలా నుంచి త్వరలో స్లిమ్ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. మోటో X70 ఎయిర్ పేరుతో (Moto X70 Air Smartphone) తొలుత చైనాలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి తాజాగా ప్రకటన చేసింది. ఇప్పటికే ఆపిల్, శాంసంగ్, హానర్, టెక్నో వంటి సంస్థలు స్లిమ్ ప్రొఫైల్ తో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. చైనాలో X70 ఎయిర్ పేరుతో లాంచ్ కానున్న స్లిమ్ మోడల్, గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం మోటోరోలా ఎడ్జ్ 70 పేరుతో అందుబాటులోకి రానుంది.
మోటో X70 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ లెనోవో చైనా వెబ్‌సైట్‌లో లిస్టింగ్ అయింది. ధర వివరాలు వెల్లడి కాకపోయినా, ఈ ఫోన్ 256GB, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుందని తెలిసింది. చైనాలో ఈ ఫోన్ బ్రాంజ్ గ్రీన్, లిలీ ప్యాడ్, గ్యాడ్జెట్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. చైనాలో అక్టోబర్ 31 న విడుదల కానుంది.

ఇతర దేశాల్లో ఈ పేరుతో స్మార్ట్‌ఫోన్ :
యూరోపియన్ సహా గ్లోబల్ మార్కెట్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 70 Smartphone) నవంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. అయితే భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే స్పష్టత లేదు. అయితే నవంబర్‌లోనే లాంచ్ కానుంది. మరియు భారత్‌లో రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్య ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు! :
చైనాలో విడుదల కానున్న మోటో X70 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీష్రెష్ రేట్ తో 6.7 అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే పాంటోన్ సపోర్టుతో SGS ఐ ప్రొటెక్షన్ ను పొందుతుంది.
ఈ మోటోరోలా స్లిమ్ మోడల్ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno GPU ను కలిగి ఉంటుంది.
మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా 50MP శాంసంగ్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 68W వైర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4800mAh బ్యాటరీని కలిగి ఉంది.
3D వేపర్ కూలింగ్ ఛాంబర్ :
మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 3D వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా మోటో X70 ఎయిర్ మోడల్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చి ఉంటుంది.
భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో ఇదే తరహా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉంటాయా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. నవంబర్‌లోనే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుందని, భావిస్తున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








