మార్కెట్లోకి మోటరోలా కొత్త ఫోన్‌లు..మోటో జెడ్, మోటో జెడ్ ప్లే

యాపిల్, సామ్‌సంగ్‌లకు ధీటుగా మోటరోలా రెండు సరికొత్త ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌పోన్‌లను మంగళవారం మార్కెట్లో లాంచ్ చేసింది.

మార్కెట్లోకి మోటరోలా కొత్త ఫోన్‌లు..మోటో జెడ్, మోటో జెడ్ ప్లే

Read More : jioకు పోటీగా దుమ్మురేపుతోన్న 10 BSNL ప్లాన్స్

మోటో జెడ్ (Moto Z), మోటో జెడ్ ప్లే (Moto Z Play) మోడల్స్‌లో లాంచ్ అయిన రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.39,999, రూ.24,999గా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అక్టోబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ అలానే అమెజాన్ ఇండియాలలో అందుబాటులో ఉంటాయి. మోటో జెడ్ స్మార్ట్ ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్లో గడిచిన జూన్‌లో లాంచ్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెమీ మాడ్యులర్ కాన్సెప్ట్ ఫోన్‌

ఈ సెమీ మాడ్యులర్ కాన్సెప్ట్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ మిన్నంటుతోంది. ఎక్స్‌టర్నల్ మాడ్యుల్స్‌తో వచ్చే ఈ ఫోన్‌లను 16 మాగ్నటిక్ పోర్ట్ సహాయంతో Moto Modsను కనెక్ట్ చేసుకోవచ్చు.

మోటో మోడ్స్ పేరుతో..

మోటో మోడ్స్ పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను మోటరోలా ఈ ఫోన్‌ల కోసం ఆఫర్ చేస్తుంది.. వీటితో Moto Z , Moto Z Play ఫోన్‌లను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన మాడ్యులర్ కేసెస్‌తో ఫోన్‌లను ఇన్‌స్టెంట్ పవర్ బ్యాంక్‌లా, సౌండ్ బూస్టర్‌లా, ప్రొజెక్టర్‌లా, అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

మోటో జెడ్ ఫోన్ ప్రత్యేకతలు..

5.5 అంగుథాల క్యూహైడెఫినిష్ అమెల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

మోటో జెడ్ ఫోన్ ప్రత్యేకతలు..

4జీబి ర్యామ్, ఇంటర్నెట్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మోటో జెడ్ ఫోన్ ప్రత్యేకతలు..

2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీ, వాటర్ రిపెల్లెంట్ కోటింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, ఎన్ఎఫ్ సీ పోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్.

మోటో జెడ్ ప్లే ఫోన్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,

మోటో జెడ్ ప్లే ఫోన్ ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మోటో జెడ్ ప్లే ఫోన్ ప్రత్యేకతలు

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3510 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

ఈ ఫోన్‌లతో వస్తోన్న Moto Mods ధరలు

JBL సౌండ్ బూస్ట్ స్పీకర్, ఈ మోటో మోడ్ వాస్తవ ధర రూ.6,999. ఫోన్ తో పాటుగా తీసుకుంటే రూ.5,999కే మీకు లభిస్తుంది.
Hasselblad ట్రు జూమ్ కెమెరా, ఈ మోటో మోడ్ వాస్తవ ధర రూ.19,999. ఫోన్ తో పాటుగా తీసుకుంటే రూ.14,999కే లభిస్తుంది.

ఈ ఫోన్‌లతో వస్తోన్న Moto Mods ధరలు

Instashare Projector, ఈ మోటో మోడ్ వాస్తవ ధర రూ.19,999. ఫోన్‌‌తో పాటుగా తీసుకుంటే రూ.15,999కే లభిస్తుంది.
Incipio offGRIDtm Power Pack, ఈ మోటో మోడ్ వాస్తవ ధర రూ.5,999. ఫోన్‌తో పాటుగా తీసుకుంటే రూ.4,999కే లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Z, Moto Z Play with Moto Mods launched in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot