Moto Z Play వచ్చేసింది, ధర ఎంతంటే..?

ఐఎఫ్ఏ 2016 వేదికగా Moto Z Play స్మార్ట్‌‌ఫోన్ ప్రపంచానికి పరిచయమయ్యింది. మోటో జెడ్ లైనప్ నుంచి వస్తున్న ఈ మూడవ స్మార్ట్‌ఫోన్‌ కోసం మోటరోలా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూరోప్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.37,300 వరకు ఉండొచ్చని అంచనా. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Read More : కొత్తగా విడుదలైన రిలయన్స్ జియో ఆఫర్లు ఇవే!

Moto Z Play వచ్చేసింది, ధర ఎంతంటే..?

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే ఈ ఫోన్‌కు Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను మోటరోలా అందిస్తోంది. వీటితో Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన మాడ్యులర్ కేసెస్‌తో ఫోన్‌ను ఇన్‌స్టెంట్ పవర్ బ్యాంక్‌లా, సౌండ్ బూస్టర్‌లా, ప్రొజెక్టర్‌లా, అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

Read More : మీ పాత నెంబర్‌తోనే Reliance Jioలోకి మారటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

డిజైనింగ్ పరంగా చూస్తే Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన మోటో Z, మోటో Z ఫోర్స్ తరహాలోనే ఉంటుంది. గ్లాస్‌తో డిజైన్ చేసిన బ్యాక్ ప్యానల్ ఆకట్టుకుంటుంది.

#2

water repellent నానో కోటింగ్‌తో వస్తోన్న మోటో Z ప్లే స్మార్ట్‌ఫోన్‌ నీటి ప్రమాదాలను ధృడంగా ఎదుర్కొగలదు.

#3

మోటో Z, మోటో Z ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌లలో కనిపించని 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో కనిపిస్తుంది.

#4

Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. 1080 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ ఆకట్టుకుంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

#5

మోటో జీ4 ప్లస్ తరహాలోనే Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ ఫ్రంట్ ఫేసింగ్ పింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది.

#6

Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేసారు. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్, పీడీఏఎఫ్, f/2.0 అపెర్చుర్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

#7

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో శక్తివంతమైన octa-core Snapdragon625 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు.

#8

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో శక్తివంతమైన octa-core Snapdragon625 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 3జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌ రెండు స్టోరేజ్ ఆప్సన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి 32జీబి వర్షన్ , మరొకటి 64జీబి వర్షన్. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2 TB వరకు విస్తరించుకునేు అవకాశం.

#9

Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే 3,510 ఎమ్ఏహెచ్ బ్యాటరీని నిక్షిప్తం చేసారు. టర్బో ఛార్జింగ్ ఫీచర్‌ను సపోర్ట్ చేయగలిగే ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 50 బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేయగలదట.

#10

Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను Moto Z Play స్మార్ట్‌ఫోన్‌‌ కోసం మోటరోలా ఆఫర్ చేస్తుంది. వీటితో ఫోన్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

#11

2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆఫరింగ్‌తో వస్తోన్న Incipico offGRID Power Pack.ఈ Mod మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను బ్యాటరీ పవర్‌హౌజ్‌లాగా మార్చేస్తుంది.

#12

 జేబీఎల్ సౌండ్ బూస్టర్ అనే మరో Mod మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను బ్యాటరీ పవర్‌హౌజ్‌లాగా మార్చేస్తుంది. InstaShare Projector సహాయంతో ఫోన్‌ను పోర్టబుల్ ప్రొజెక్టర్ లా మార్చేసుకోవచ్చు.

#13

ఈ ఫోన్‌తో ఆఫర్ చేస్తున్న Hasselblad True Zoom Moto Mod, ఫోన్‌ను అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Z Play with Moto Mods Announced: Here Are 10 Promising Features. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot