ప్రారంభమైన Moto Z2 Play సేల్, ఆఫర్లు ఇవే

మోటరోలా నుంచి గతవారం మార్కెట్లో లాంచ్ అయిన Moto Z2 Play స్మార్ట్‌ఫోన్‌ ఇప్పడు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతోంది. ధర రూ.27,999. లాంచ్ డే ఆఫర్స్ క్రింద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. వాటివివరాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

No-Cost EMI, ఇన్‌స్టెంట్ డిస్కౌంట్..

No-Cost EMI పై ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే 5% ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పై బుయ్ బ్యాక్ గ్యాంటీ స్కీమ్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. రూ.599 పెట్టి ఈ ఆఫర్‌ను తీసుకోవల్సి ఉంటుంది.

బుయ్ బ్యాక్ గ్యారంటీ స్కీమ్, 100జీబి జియో 4జీ డేటా

6 నెలలలోపు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వద్ద ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద రూ.11,000 లభిస్తుంది. 12 నెలలలోపు ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద రూ.8,500 లభిస్తుంది. ఈ ఫోన్‌తో పాటుగా వస్తోన్న మోడ్స్ పై 55% వరకు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలు పై రిలయన్స్ జియో యూజర్లకు లెనోవో 100జీబి 4జీ డేటాను ఉచితంగా ఇస్తోంది.

స్లీక్ డిజైన్‌‌ ఫోన్...

స్లీక్ డిజైన్‌‌తో వస్తోన్న మోటో జెడ్2 ప్లే స్మార్ట్‌ఫోన్ 5.99 మిల్లీ మీటర్ల మందంతో కేవలం 145 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో ఇన్ బిల్ట్ వస్తోన్న నైట్ డిస్ ప్లే ఫీచర్ రాత్రిపూట లైటింగ్ ను బట్టి స్క్రీన్ ఉష్ణోగ్రతను ఎడ్జస్ట్ చేసుకుంటుంది.

డిస్‌ప్లే, ర్యామ్, స్టోరేజ్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ వచ్చేసిరకి 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టం..

12 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ ఆటో ఫోకస్ లెన్స్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 3000mAh బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Z2 Play goes on sale via Flipkart at Rs.27,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot