స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి Moto Z3 Play....
మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ Moto Z3 play త్వరలో రాబోతుంది .ఎప్పటికప్పుడు కొత్త ధనం చూపించే మోటోరోలా సంస్థ ఈ సారి అధునాతన ఫీచర్స్ తో Moto Z3 play ని మార్కెట్ లోకి తీసుకొస్తుంది . కాగా Moto Z2 play విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా Moto Z3 Play ఫోన్ లాంచ్ కాబోతొంది. Moto Z2 play సంస్థకి లాభాలు తెచ్చిపెట్టిన నేపథ్యంలో Moto Z3 play అంతకంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందని కంపెనీ దీమా వ్యక్తం చేస్తోంది.
ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ Moto Z2 play కి మించిపోయాలా ఉండవచ్చు అని సమాచారం. కాగా Moto Z2 play ధర ఫ్లిప్కా ర్ట్ లో రూ 27,500 ఉంది . Moto Z3 Play ధర ఫై ఎటువంటి సమాచారం లేనప్పటికీ Moto Z2 play ధరకు అటు ఇటు గ ఉండే అవకాశం ఉంది. Moto Z2 play ఫీచర్స్ విషయానికి వస్తే సన్నని బెజెల్ లెస్ డిస్ప్లే తో చాలా అకర్షణీయంగా తీర్చి దిద్దినట్టు తెలుస్తోంది . డ్యుయల్ సిమ్ తో పాటు 18:9 యాస్పెక్ట్ రేషియో తో అలాగే 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా తో రానుంది. అధునాతన ఇమేజ్ సెన్సర్లను కలిగి ఉంది. ఫోన్ బరువు కూడా చాలా తేలికగా ఉంటుందని అంచనా .

Moto Z3 Play ఫీచర్లు(అంచనా ):
6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8GHz octa-core క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 SoC,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.
కాగా గత ఏడాది విడుదలైన Moto Z2 Play ఫీచర్ల కింది విధంగా ఉన్నాయి.
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 626 SoC,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.


Click it and Unblock the Notifications