ప్రపంచ మార్కెట్లోకి ‘Moto Z3’, 5జీ సపోర్ట్‌తో

మోటరోలా నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. చికాగోలో నిర్వహించిన ఓ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా Moto Z3 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా విడుదల చేసింది.

|

మోటరోలా నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. చికాగోలో నిర్వహించిన ఓ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా Moto Z3 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా విడుదల చేసింది.ఈ డివైస్‌ను జూన్‌లో లాంచ్ అయిన Moto Z3 Playకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌‌గా భావిస్తున్నారు.స్ప్లాష్ రెసిస్టెంట్ బిల్డ్, ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, మోటో మోడ్స్ సపోర్ట్ వంటి ఆసక్తికర ఫీచర్లతో లాంచ్ అయిన ఈ డివైస్ మోటో జెడ్ సిరీస్ లెగసీని కంటిన్యూ చేసినట్లయ్యింది.

 

క్వాల్కమ్‌తో కలిసి 5జీ మోటో మోడ్..

క్వాల్కమ్‌తో కలిసి 5జీ మోటో మోడ్..

ఈ ఫోన్ రూపకల్పనలో భాగంగా క్వాల్కమ్‌తో ఒప్పందం కుదర్చుకున్న మోటరోలా 5జీ మోటో మోడ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవటం ద్వారా తరువాతి తరం నెట్‌వర్క్‌ను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. మోటో జెడ్3 ప్లే తరహోలోనే మోటో జెడ్ 3 కూడా వన్ బటన్ నేవిగేషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. దీంతో వన్‌ప్లస్ ఎక్స్ తరహా ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఫోన్ ఆఫర్ చేయగలుగుతుంది.

 

 

వాటర్ - రిపెల్లెంట్ పీ2ఐ కోటింగ్‌..

వాటర్ - రిపెల్లెంట్ పీ2ఐ కోటింగ్‌..

ప్రస్తుతానికి ఈ డివైస్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతున్నప్పటికి త్వరలో ఆండ్రాయిడ్ పీ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కాబోతోంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థ, ఈ స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. వాటర్ - రిపెల్లెంట్ పీ2ఐ కోటింగ్‌తో వస్తోన్న ఈ డివైస్ స్పిల్స్ ఇంకా స్ప్లాషెస్ నుంచి ఫోన్‌ను రక్షిస్తుంది.

 

 

Moto Z3 స్పెసిఫికేషన్స్..
 

Moto Z3 స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080x2160 పిక్సల్స్) అమోల్డ్ డిస్‌ప్లే విత్ మ్యాక్స్ విజన్ 18:9 యాస్పెక్ట్ రేషియో అండ్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయడ్ పి), ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం,

 

 

కెమెరా స్పెక్స్ పరిశీలించినట్లయితే..

కెమెరా స్పెక్స్ పరిశీలించినట్లయితే..

12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ బరువు 156 గ్రాములు, చుట్టుకొలత 156.5x76.5x6.75 మిల్లీ మీటర్లు.

 

 

Best Mobiles in India

English summary
Moto Z3 With 5G Moto Mod, Snapdragon 835 Launched: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X