ఫేస్‌బుక్‌లో అలజడి.. ఆ ఫోటో అబద్ధం!

Posted By:

ఫేస్‌బుక్‌లో అలజడి.. ఆ ఫోటో అబద్ధం!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటరోలా ( Motorola) మంగళవారం తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీ పై ఆసక్తికర అంశాన్ని పోస్ట్ చేసింది. ‘క్వచ్చిన్ మార్క్’ నమూనాతో కూడిన ఫోటో‌గ్రాఫ్‌ను ప్లేస్ చేసిన మోటరోలా ‘‘ లెట్స్ ప్లే ద గేమ్. గెస్ ద స్మార్ట్ ఫోన్’’ అనే టాగ్‌ను జోడించింది. అంతేకాకుండా..ఈ 4జీ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను శుక్రవారం రివీల్ చేస్తామంటూ పేర్కొంది. ఈ ఆసక్తికర పజిల్ అభిమానులతో పాటు టెక్ విశ్లేషకులను కొద్దిపాటి అయోమయానికి లోను చేసింది. మోటరోలా తాజా ఆవిష్కరణల జాబాతాలో ‘డ్రాయిడ్ రాజర్ హెచ్‌డి’, ‘మోటరోలా ఆట్రిక్స్ హెచ్‌డి’ల ఉండటంతో రివీల్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్ ఈ రెండిటిలో ఏదో ఒకటి అయి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావించాయి. ఈ అంశం పై రకరకాల సందేహాలు చుట్టుముడుతున్న నేపధ్యంలో మరో షాకిచ్చే వార్త మొత్తం వేడిని చల్లార్చేసింది. ‘ఈ సామాజిక ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని, అభిప్రాయాలను తెలుసుకునే ఫేస్‌బుక్ గేమ్ మాత్రమేనని మోటరోలా మహిళా అధికార ప్రతినిధి బెక్కీ లియోనార్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot