Home
Mobile

ధర రూ.15,000లో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా.. ఈ హ్యాండ్‌సెట్‌ల గురించి తెలుసుకోండి!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ భారత్‌లో గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశంలో ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్‌షిప్‌ మోడళ్ల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ మంది బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు కూడా రూ.15,000 ధర సెగ్మెంట్‌లో అనేక మోడళ్లను లాంచ్ చేస్తుంటాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా (Motorola Smartphones under RS15000) ఈ ధర రేంజ్‌లో అనేక హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మోటో G34 స్మార్ట్‌ఫోన్‌ :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకుంటుంది.

moto smartphones under 15k

ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 5G చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 పై పని చేస్తుంది. కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP మరో కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు LED ఫ్లాష్‌ లైట్‌తో వచ్చింది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది. టర్బో ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.10999 గా ఉంది.

మోటో G45 5G స్మార్ట్‌ఫోన్ :
మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌ 6.45 అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 1600*720 పిక్సల్‌ రిజల్యూషన్‌, 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది.

moto smartphones under 15k

ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత MX Skin పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP+ 2MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.10,999 గా ఉంది.

మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్‌ :
మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), PDAF, f/1.8 అపేచర్‌తో 50MP కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు. 33W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Motorola 5G Smartphones under RS15000 Price here is the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X