పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

Posted By: Prashanth

పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

 

అవను.. మోటరోలా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ స్టన్నింగ్ బ్రాండ్ ప్రవేశపెట్టనున్న ఫ్లిప్ మోడల్ ఫోన్ మోటోస్మార్ట్ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఫ్లిప్ తరహా ఫోన్ వాడుతున్నారంటే అదోరకమైన హుందా. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి పలు ఫీచర్లను ఇటీవలే కంపెనీ రివీల్ చేసింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

3.2 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, క్వాలిటీ వీడియో రికార్డింగ్, 512ఎంబీ ర్యామ్, మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్, జీపీఆర్ఎస్, వై-పై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), క్వాలిటీ ఆడియో ప్లేయర్, క్వాలిటీ వీడియో ప్లేయర్, గేమ్స్, మోనో స్పీకర్స్, ఆడియో జాక్, బ్యాటరీ స్టాండ్ బై 500 గంటలు, టాక్‌టైమ్ 9 గంటలు.

ఈ ఫ్లిప్‌ ఫోన్‌లో పొందుపరిచిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ యూజర్లకు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. పొందుపరిచిన కెమెరా వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువ చేస్తుంది. ఫోన్ ఫ్రంట్ ఫోర్షన్‌లో ఏర్పాటు చేసిన కెమెరా ప్రత్యక్ష ఛాటింగ్‌తో పాటు వీడియోలను చిత్రీకరించుకునేందుకు తోడ్పడుతుంది. డివైజ్ డిజిటల్ జూమ్ పరిమాణం 10X. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.

డివైజ్‌లో అభివృద్ధి చేసిన క్వాల్కమ్ అడిర్నో 200 గ్రాఫిక్ కంట్లోలర్, ఫోన్ మల్టీమీడియా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దోహదం చేసిన వైర్‌లెస్ LAN వ్యవస్థ ఇంటర్నల్ యాంటినా ద్వారా సపోర్ట్ చేయబడుతుంది. బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు వేగవంతమైన కనెక్టువిటీ సామర్ధ్ర్యాన్ని కలిగి ఉంటాయి. లోడ్ చేసిన ఆపరేటింగ్ వ్యవస్థ యూజర్ ఫ్రెండ్లీ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ ధర ఇతర విడుదల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot