ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న మోటరోలా ఆట్రిక్స్ 2

Posted By: Staff

ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న మోటరోలా ఆట్రిక్స్ 2

గ్లోబల్ మొబైల్ మార్కెట్లో మోటరోలాది ప్రత్యేకమైన స్దానం. గతంలో మోటరోలా విడుదల చేసిన మోటరోలా ఆట్రిక్స్ మొబైల్ హ్యండ్ సెట్ మార్కెట్లో చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. ఒకరకంగా చెప్పాలంటే మోటరోలా కంపెనీ విడుదల చేసిన మొబైల్స్‌లలో ఆట్రిక్స్ సిరిస్ బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అటువంటి సక్సెస్ సిరిస్ నుండి మోటరోలా మరో కొత్త మొబైల్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని పేరే మోటరోలా ఆట్రిక్స్ 2.

మోటరోలా ఆట్రిక్స్ 2 ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో పవర్ పుల్ డ్యూయల్ కోర్ టెక్సాస్ 1.2 GHz లేదా1.5 GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయనున్నారు. గూగుల్ స్వాదీనం చేసుకున్న చేసుకున్న మొబైల్ ఫోన్స్‌లలో మోటరోలా ఆట్రిక్స్ 2 మొబైల్ ఒకటి. మోటరోలా ఆట్రిక్స్ 2 మొబైల్ యూజర్స్‌కు మోటరోలా మొబైల్స్ పటిష్టతను తెలియజేస్తుంది. పవర్ ప్యాక్ ఫెర్పామెన్స్ యూజర్స్‌కు అందింజేందుకు గాను ఇందులో 1 GHz NVIDIA Tegra 2 CPUని అమర్చడం జరిగింది.

కొన్ని వారాల క్రితం ఇంటర్నెట్లో మోటరోలా ఆట్రిక్స్ 2MB865 హ్యాండ్ సెట్‌ సంబంధించిన సమాచారం వెలువడడం జిరిగింది. దీనిని కూడా త్వరలోనే మోటరోలా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. మోటరోలా ఆట్రిక్స్ 2 స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరాతో పుల్ HD 1080p వీడియోస్‌ని తీయవచ్చు. ఇంకా కెమెరాలో ఎల్‌ఈడి ఫ్లాష్ టెక్నాలజీ, డిజిటల్ జూమ్ ప్రత్యేకతలు. మొబైల్ ముందు భాగంలో ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరా వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తుంది.

మోటరోలా ఆట్రిక్స్ 2 ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే గూగుల్‌ చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వి2.3.5 జింజర్ బ్రెడ్ వర్సన్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్ గ్రేడ్ కూడా చేసుకొవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మొబైల్‌ ఇనిస్టాల్ చేసుకొవడం వల్ల ఉండే ముఖ్య ఉపయోగాలు ఏంటంటే గూగుల్ అప్లికేషన్స్ అయిన గూగుల్ టాక్, యూ ట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వాటిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 4.5 ఇంచ్‌ ఉండగా, స్క్రీన్ సైజు రిజల్యూషన్ 960 x 540 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. సాధారణంగా మోటరోలా విడుదల చేస్తున్న ఈ మోటరోలా ఆట్రిక్స్, మోటరోలా ఆట్రిక్స్ 2 రెండు మొబైల్స్ కూడా ల్యాప్ టాప్ డాకింగ్ సిస్టమ్‌ని కలిగి ఉన్నాయి. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే మొబైల్‌ని డైరెక్టుగా మోనేటర్స్, టివిలకు కనెక్టు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మోటరోలా ఆట్రిక్స్ 2 మొబైల్ ధరని ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot