భారత్‌లో 25 లక్షల ఫోన్‌లను విక్రయించిన మోటరోలా

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రివ్వున దూసుకొచ్చిన మోటరోలా తన ‘మోటో జీ', ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌లతో రికార్డ్ స్థాయి అమ్మకాలను సృష్టించింది. భారత్ మార్కెట్టో మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మోటరోలా ఫోన్‌ల అమ్మకాలకు సంబధించి ఆసక్తికర వివరాలను వెల్లడించింది. తాము ఇప్పటి వరకు 2.5 మిలియన్ల మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్‌లో 25 లక్షల ఫోన్‌లను విక్రయించిన మోటరోలా

స్మార్ట్‌ఫోన్ అమ్మకాల చరిత్రలో సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. ఈ నెల 24 నుంచి డిసెంబర్ 7 వరకు ఫ్లిప్‌కార్ట్ వద్ద మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను కొను‌గోలు చేసిన వారిలో ఐదుగురు లక్కీ విజేతలను ఎంపిక చేసి వారికి రూ.50,000 గిఫ్ట్ వోచర్లను అందిస్తారు. అంతేకాకుండా, 100 మంది కస్టమర్‌లకు 100% క్యాష్ బ్యాక్  ఆఫర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Motorola Boasts 2.5 Million Smartphone Sales in India Via Flipkart. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot