Home
Mobile

బడ్జెట్ ధరలో మోటో బెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. లిస్ట్‌, ఫీచర్లు, ధర వివరాలు..!

Moto Budget smartphones : బడ్జెట్‌ ధర స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం అనేక సంస్థలు ఈ ధర సెగ్మెంట్‌లో అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా ప్రస్తుతం బడ్జెట్‌ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉంది. ఆకట్టుకొనే డిజైన్, కెమెరాతోపాటు బ్యాటరీలను కలిగి ఉంది. మోటోరోలా బడ్జెట్‌ సెగ్మెంట్లో మోటో G85, మోటో G45, మోటో G86 పవర్‌ వంటి బెస్ట్ మోడల్స్‌ ఉన్నాయి.

మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Motorola G85 5G) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ పొందుతుంది.

moto g85

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 Hello UI పైన పనిచేస్తోంది. ఈ మోటో ఫోన్‌ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ కోబాల్ట్‌ బ్లూ, ఒలివ్‌ గ్రీన్‌, అర్బన్ గ్రే, వివా మజెంటా కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్‌ 50MP సోనీ LYT 600 (OIS) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

moto g85

మోటో G45 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Motorola G45 5G) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ ఫోన్ బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్‌ గ్రీన్‌, పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. మరియు 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా మోటో G45 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

moto g85

మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ (Moto G86 Power 5G) ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. గోల్డెన్‌ సైప్రెస్‌, కాస్మిక్‌ స్కై, స్పెల్‌ బౌండ్‌ కలర్‌ వేరియంట్స్‌ లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 33W టర్బోపవర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

ఈ మోటో ఫోన్ 6.7 అంగుళాల సూపర్‌ HD అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3 ఇన్ 1 ఫ్లిక్కర్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Best motorola budget 5G smartphones here is the list and features, sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X