Home
Mobile

బ్యాటరీ లేదా పనితీరు.. ఎందులో " Power " చూపిస్తుంది.. పూర్తి వివరాలు!

మోటోరోలా నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌తోపాటు మోటో G96, మోటో G86 పవర్‌ వంటి స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఈ మోడ్‌లు రూ.15 వేల నుంచి రూ.30 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే మోటోరోలా నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మోటోరోలా తమ X హ్యాండిల్‌ ద్వారా ఫోన్‌ డిజైన్‌ను విడుదల చేసింది.

కొత్త బడ్జెట్ ఫోన్ :
టీజర్‌ విడుదల సమయంలో Power అనే పదాన్ని ఉపయోగించింది. దీని ఆధారంగా పవర్ పేరుతో కొత్త ఫోన్‌ విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే మోటోరోలా G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల అయింది. అయితే ఫోన్‌ పేరు, లాంచ్ వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.

moto G06 power

ఈ పేరుతోనే విడుదల కానుందా? :
పవర్ పేరుతో లాంచ్‌ చేస్తున్న ఫోన్‌లు భారీ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్‌ కూడా భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మోటో G06 పవర్‌ పేరుతో (Moto G06 Power Smartphone) లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

యూరప్‌ మార్కెట్‌లో :
ఈ ఫోన్‌ ఇప్పటికే యూరప్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ఆధారంగా ఈ ఫోన్ అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. మోటో G06 పవర్‌ యూరప్‌ వేరియంట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

యూరప్‌ వేరియంట్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆ మార్కెట్‌లో 4GB, 8GB ర్యామ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్‌ ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. పేరుకు తగ్గట్టుగా 18W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ మోటోరోలా ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సర్, మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్పీకర్‌లు, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ను కూడా కలిగి ఉంది. అయితే భారత్‌ మార్కెట్‌లో ఏయే ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందో వెల్లడి కాలేదు. అయితే పవర్ పేరుకు తగ్గట్టుగా భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మోటోరోలా అప్‌కమింగ్ బడ్జెట్ ఫోన్‌ పేరు సహా విడుదల వివరాలు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పటికే అనేక సంస్థలు భారీ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేసిన నేపథ్యంలో మోటోరోలా కూడా 7000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీతో ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola could launch a moto G06 power smartphone with large battery in india, teased
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X