మోటరోలా కొత్త ఫోన్లు మరో సంచలనం కాబోతోన్నాయా..?

2017లో మోటరోలా లాంచ్ చేయబోతోన్న కొత్త ఫోన్ లకు సంబంధించి రోజుకో ఆసక్తికర సమచారం వెలుగులోకి వస్తోంది. తాజాగా లీకైన మరో ఇమేజ్ ద్వారా మోటరోలా కొత్త ఎడిషన్ ఫోన్‌లకు సంబంధించి మరిన్ని వివరాలు బహిర్గతమయ్యాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto gS, Moto gS+

మోటో జీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్‌కు సక్సెసర్ వర్షన్‌గా రావల్సి ఉన్న ఫోన్‌లను మోటో జీఎస్ ( Moto gS ), మోటో జీఎస్+ (Moto gS+) వేరియంట్‌లలో మోటరోలా లాంచ్ చేయబోతోన్నట్లు లీకైన్ రోడ్ మ్యాప్ ద్వారా తెలుస్తోంది.

డ్యుయల్ కెమెరా సెటప్‌

Moto gS వర్షన్ మెటల్ బాడీతో పాటు 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరో వేరియంట్ మోటో జీఎస్+ 5.5 అంగుళాల అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పాటు డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

Moto Z2 Play, Moto Z2 Force

మోటరోలా విడుదల చేసిన రోడ్ మ్యాప్ ప్రకారం... Moto Z Play, Moto Z Force మోడల్స్ అప్‌గ్రేడెడ్ వర్షన్‌లైను Moto Z2 Play, Moto Z2 Forceలను కూడా మోటరోలా తీసుకురాబోతోంది.

మోటో ఎక్స్ (2017)..

మరోవైపు మోటో ఎక్స్ (2017) కూడా లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 5.2 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. స్మార్ట్‌క్యామ్ ఫీచర్ ఈ డివైస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందట.

మోటో సీ, మోటో సీ ప్లస్

ఇదే సమయలో తన మోటో ఇ4, మోటో ఇ4 ప్లస్ లతో పాటు మోటో సీ, మోటో సీ ప్లస్ హ్యాండ్‌సెట్‌లను కూడా మోటరోలా అందుబాటులోకి తీసుకురాబోతోన్నట్లు తెలుస్తోంది.

5000mAh బ్యాటరీలతో..

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో అందుబాటులో ఉండొచ్చని భావిస్తోన్న మోటో ఇ4 ఫోన్‌లు ఏకంగా 5000mAh బ్యాటరీలతో వస్తున్నాయి. మరో వైపు మోటో సీ, మోటో సీ ప్లస్ ఫోన్‌లు కూడా 4000mAh బ్యాటరీలతో రాబోతున్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
Motorola Could Release Moto gS and Moto gS+, Reveals Leaked Product Roadmap. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting