నీటిలో పడినా.. చక్కగా పనిచేసే ఫోన్

Posted By: Staff

నీటిలో పడినా.. చక్కగా పనిచేసే ఫోన్

దేశీయ మొబైల్ దిగ్గజం మోటరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మోటరోలా డెపీ ఇక మీదట కొన్ని ఫీచర్స్‌తో, కొత్త శక్తిగా ఎదగనుంది. మోటరోలా విడుదల చేసినటువంటి మోటరోలా ఢెపీ ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న స్మార్ట్ పోన్స్‌కి ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో అవన్ని కూడా కస్టమర్స్‌ యొక్క ఆశలకు అనుగుణంగా రూపోందించబడినవే. అందులో భాగంగా మోటరోలా ఇప్పుడు మోటరోలా డెఫీ ప్లస్‌ని విడుదల చేయనుంది.

మోటరోలా త్వరలో విడుదల చేయనున్న మోటరోలా డెఫీ ప్లస్ ఎమ్‌బి526 దుమ్ము ధూళి నుండి తట్టుకొని నిలబడగలిగే ఫోన్. నీటిలో పడిపోయినప్పటికీ మోటరోలా డెఫీ ప్లస్ ఎమ్‌బి526కి ఎటువంటి ఇబ్బంది రాదు. 1GHz పవర్ పుల్ ప్రాసెసర్‌ని కలిగి ఉండి, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంది. ఈ మొబైల్‌లో ఇంకో విశిష్టత ఏమిటంటే గోరిల్లా డిస్ ప్లేని కలిగి ఉండి, యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌‌ని అందిస్తుంది.

5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడం వల్ల చక్కని ఇమేజిలను తీయడమే కాకుండా, తీసినటువంటి ఇమేజిలను ఎడిట్ చేసుకునే వెసులు బాటు కూడా కల్పించడం జరిగింది. కెమెరాకి ఎగస్ట్రా ఫీచర్స్ ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ప్లాష్ ప్రత్యేకం. మోటరోలా డెఫీ ప్లస్ ఎమ్‌బి526 3.7 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉండి యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందిస్తుంది. ఇక మార్కెట్లో ఉన్న అన్నిరకాల ఆడియో, వీడియా ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఖరీదు ఇంకా మార్కెట్లోకి వెల్లడించలేదు. రాబోయే నెలలో ఆసియా, యూరప్, లాటిన్ అమెరికాలలో విడుదల చేయనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot