ఫస్ట్ టార్గెట్ చైనా ..?

Posted By: Staff

ఫస్ట్ టార్గెట్ చైనా  ..?

 

మొబైల్ ఫోన్ సెక్టార్టలోకి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్లు కుప్పలు తెప్పలుగా  వచ్చి పడుతున్న విషయం తెలిసిందే.  మొబైల్  నిర్మాణంలో సంస్థాగత మార్పులకు ఆజ్యం పోసిన మోటరోలా ( Motorola) కొత్త ఎడిషన్ ఫోన్‌ను తొలత చైనాలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘మోటరోలా XT320’ వేరియంట్లో డిజైన్ కాబడిన ఈ మొబైల్ గ్యాడ్జెట్‌కు సంబంధించి అధికారికంగా ఏ విధమైన సమాచారం లేదు. విశ్వసనీయ వర్గాలు ఈ ఫోన్ స్సెసిఫికేషన్లకు సంబంధించి పలు అంశాలను లీక్ చేశాయి. వాటి వివరాలను  ఇప్పుడు చూద్దాం...

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ రన్ అవుతుంది. 512 ఎంబీ ర్యామ్  మొబైల్  మెమరీని పటిష్టతం పెంచుతుంది. 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ క్లారిటీతో కూడిన చిత్రాలను అందిస్తుంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్ఎస్డీపీఏ, యూఎస్బీ వ్యవస్థలు ఫోన్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని పెంచుతాయి. మెమరీని మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సౌలభ్యతతో పెంచుకోవచ్చు.   HVGA టచ్ స్ర్కీన్ వ్యవస్థతో ఫోన్ ఆపరేటింగ్ మరింత సులువుగా మారుతుంది. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను డివైజ్ సపోర్ట్ చేస్తుంది.

‘మోటరోలా XT320’ను తొలత చైనాలో లాంఛ్ చేసేందుకు మోటరోలా యాజామాన్యం కసరత్తులు చేస్తుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్‌కు ఈ డివైజ్ రావచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting