చైనాలో మొదలెట్టిన తరువాత ఇండియాలోకి..?

By Prashanth
|
Motorola Defy Mini


మొబైల్ ఫోన్ సెక్టార్టలోకి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న విషయం తెలిసిందే. మొబైల్ నిర్మాణంలో సంస్థాగత మార్పులకు ఆజ్యం పోసిన మోటరోలా ( Motorola) కొత్త ఎడిషన్ ఫోన్ ను తొలత చైనాలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘మోటరోలా XT320’ వేరియంట్లో డిజైన్ కాబడిన ఈ మొబైల్ గ్యాడ్జెట్ కు సంబంధించి అధికారికంగా ఏ విధమైన సమాచారం లేదు. విశ్వసనీయ వర్గాలు ఈ ఫోన్ స్సెసిఫికేషన్లకు సంబంధించి పలు అంశాలను లీక్ చేశాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ రన్ అవుతుంది. 512 ఎంబీ ర్యామ్ మొబైల్ పనితీరును వేగిరితం చేస్తుంది. 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ క్లారిటీతో కూడిన చిత్రాలను అందిస్తుంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్ఎస్డీపీఏ, యూఎస్బీ వ్యవస్థలు ఫోన్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని పెంచుతాయి. మెమరీని మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సౌలభ్యతతో పెంచుకోవచ్చు. HVGA టచ్ స్ర్కీన్ వ్యవస్థతో ఫోన్ ఆపరేటింగ్ మరింత సులువుగా మారుతుంది. జీఎస్ఎమ్ నెట్ వర్క్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

‘మోటరోలా XT320’ను తొలత చైనాలో లాంఛ్ చేసేందుకు మోటరోలా యాజామాన్యం కసరత్తులు చేస్తుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి అధికారింకంగా వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ విడుదల 2012 ప్రధమాంకంలో ఉండొచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X