ఒకే విధమైన ఫీచర్స్, ప్రాసెసర్ లోనే తేడా..

Posted By: Super

ఒకే విధమైన ఫీచర్స్, ప్రాసెసర్ లోనే తేడా..

మార్కెట్లోకి కొత్త హ్యాండ్ సెట్స్ విడుదలైన ప్రతిసారీ మొబైల్స్ ఔత్సాహికులకు అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకొవాలనే ఆసక్తి ఉంటుంది. యూజర్స్ కోసం మొబైల్ కంపనీలు నాణ్యమైన మొబైల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇటీవలే దేశీయ మొబైల్ దిగ్గజం మోటరోలా తమ కంపెనీ నుండి కొత్త ఉత్పత్తి మోటరోలా డెఫీ ప్లస్‌ని, అదే విధంగా మరో మొబైల్ దిగ్గజం హెచ్‌టిసి నుండి హెచ్‌టిసి డిజైర్ ఎస్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు మొబైల్స్‌ని కూడా టచ్ స్క్రీన్ సెగ్మెంట్లో విడుదల చేయడం జరిగింది.

మోటరోలా డెపీ ప్లస్, హెచ్ టిసి డిజైర్ ఎస్ రెండు మొబైల్స్ కూడా టచ్ స్క్రీన్ ఫెసిలిటీని కలిగి ఉండడంతో పాటు మల్టీ టచ్ ఆఫ్షన్స్‌ వీటి సొంతం. రెండు మొబైల్స్ కూడా 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి హై క్వాలిటీ ఇమేజిలను తీయగలగుతాయి. అంతేకాకుండా ఆటో ఫోకస్, ఎల్ ఈడి ఫ్లాష్ కెమెరాకి అదనపు ప్రత్యేకతలు. 2జీతో పాటు 3జీ నెట్ వర్క్ ను కూడా రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి. జిపిఆర్‌ఎస్, ఎడ్జి లాంటి వాటితో ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వడంతో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్‌ని ఉపయోగించి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయినటువంటి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

యూజర్స్‌కు ఈ రెండు హ్యాండ్ సెట్స్ ఇంకా దగ్గరయ్యే ఉద్దేశ్యంతో కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, యుఎస్‌బి కనెక్టివిటీ లాంటివి ఉపయోగపడతాయి. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే కామన్ ఫీచర్స్ అయిన మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్ మొదలగున అన్నింటిని కూడా సపోర్ట్ చేస్తాయి. మోటరోలా డెపీ ప్లస్, హెచ్ టిసి డిజైర్ ఎస్ రెండు మొబైల్స్ లలో కూడా ఆండ్రాయిడ్ హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రౌజర్ ఉండడంతో బ్రౌజింగ్ చాలా ఈజీగా ఉంటుంది.

రెండు మొబైల్స్ లలో కూడా ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడడం వల్ల మల్టీ టాస్కింగ్ ఈజీగా ఉంటుంది. ఇక ప్రాసెసర్స్ విషయంలోనే రెండింటిలో కొంచెం తేడా ఉంది. మోటరోలా డెఫీ ప్లస్ 1GHz ప్రాసెసర్‌తో రూపోందించగా, అదే హెచ్ టిసి డిజైర్ ఎస్ మాత్రం 1GHz క్వాలికామ్ 8255 స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్‌తో రూపోందించడం జరిగింది. రెండు మొబైల్స్ కూడా పవర్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌‍ని సపోర్ట్ చేస్తాయి. ఇక ధర విషయానికి వస్తే మోటరోలా డెఫీ ప్లస్ ధర ఇంకా ఇండియాలో వెల్లడించలేదు. హెచ్‌టిసి డిజైర్ ఎస్ ధర మాత్రం రూ 20,000గా ఇండియాలో విడుదలైన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot