మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌తో ‘మోటరోలా డెఫీ’!!

Posted By: Super

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌తో  ‘మోటరోలా డెఫీ’!!

 

‘మోటరోలా డెఫీ’ (Motorola Defy) అప్ డేటెడ్ వర్షన్ గా విడుదలైన ‘మోటరోలా డెఫీ ప్లస్’ స్మార్ట్ ఫోన్ మార్కెట్ సెగ్మంట్ లో హల్ చల్ చేస్తుంది. డెఫీతో పోలిస్తే  డెఫీ ప్లస్ బ్యాటరీ సామర్ధ్యం  అధికం. ఫోన్లో నిక్లిప్తం చేసిన 1 GHz TI OMAP 3620 ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది. ఇక మిగిలిన ఫీచర్ల విషయానికొస్తే... దుమ్ము మరియు నీటి చమ్మను తట్టుకునే విధంగా డిస్ ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లో పటిష్టితం చేశారు.

డివైజ్ ఆండ్రాయిడ్  2.3 జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 5మెగా పిక్సల్  ప్రైమరీ కెమెరా ఆటోఫోకస్ అదేవిధంగా LED ఫ్లాష్ వ్యవస్థను కలిగి ఉంటుంది. సెకండరీ కెమెరా విషయంలో కాస్తంత నిరుత్సాహానికి గురికాక తప్పదు. 3జీ వ్యవస్థను ఈ డిబైజ్ సపోర్ట్ చేస్తుంది. డౌన్ లోడ్ స్పీడ్ 7.2Mbps, వైఫై, బ్లూటూత్, జీపీఎస్  వ్యవస్థలు వేగవంతమైన కనెక్టువిటీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. యాక్సిలరోమీటర్, కంపాస్, స్టీరియో ఎఫ్ఎమ్, ఆర్డీఎస్, ప్రాక్సిమిటీ సెన్సార్ తదితర అప్లికేషన్లను  ముందుగానే మొబైల్ లో లోడ్ చేశారు. ధర రూ.16,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot