కొత్త హాంగులతో 'రేజర్' కాస్త 'రేజర్ మ్యాక్స్'

Posted By: Staff

కొత్త హాంగులతో 'రేజర్' కాస్త 'రేజర్ మ్యాక్స్'

 

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా కస్టమర్స్‌ని సొంతం చేసుకున్న మోటరోలా మొబైల్ తయారీదారు గతంలో మార్కెట్లోకి 'మోటరోలా డ్రాయిడ్ రేజర్' స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ 'మోటరోలా డ్రాయిడ్ రేజర్' స్మార్ట్ ఫోన్‌లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండడంతో తిరిగి మరలా దీనిని 'మోటరోలా డ్రాయిడ్ రేజర్ మ్యాక్స్' పేరుతో విడుదల చేస్తుంది. గతంలో విడుదల చేసిన 'మోటరోలా డ్రాయిడ్ రేజర్'లో బ్యాటరీ ప్రాబ్లమ్ ఉండడంతో మార్కెట్లో పెద్దగా సక్సెస్ సాధించ లేదు.

మోటరోలా 'మోటరోలా డ్రాయిడ్ రేజర్ మ్యాక్స్' మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ అధికారకంగా ప్రకటించక పోయినప్పటికీ ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఇమేజి, ఫీచర్స్ ప్రకారం వన్ ఇండియా మొబైల్ పాఠకులకు అందజేయడం జరుగుతుంది.

'మోటరోలా డ్రాయిడ్ రేజర్ మ్యాక్స్' మొబైల్‌ ప్రత్యేకతలు:

* A max aperture of 3.0

* 1800 units of Flash energy

* Digital Zoom ratio of 1.0000153

* Light source – 2

* a 4.5 inch monstrous Super AMOLED touchscreen display

* a screen resolution of 1280 x 720 pixels

* A superb 13 Megapixel camera.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.5 ఇంచ్‌లుగా స్క్రీన్ సైజు రూపొందించడమే కాకుండా సూపర్ AMOLED టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 13 మెగా ఫిక్సల్ కెమెరా మొబైల్ మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు మోటరోలా ప్రతినిధులు.

మోటరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న ఈ మొబైల్ ఇప్పటికే మార్కెట్లో హాల్ చల్ చేస్తున్న శాంసంగ్ గెలాక్సీనెక్సస్, నోకియా లుమియా 800, ఐఫోన్ 4ఎస్ లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot