ఇండియన్ మార్కెట్లోకి మోటరోలా డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్

ఒకే కోవకు చెందిన రెండు మోడళ్ల మోటరోలా స్మార్ట్ ఫోన్లు ప్రస్తుత మార్కెట్లో తమ హవాను కొనసాగిస్తున్నాయి. అవే మోటరోలా డ్రాయిడ్ 2, మోటరోలా డ్రాయిడ్ 3. యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్మడవుతున్నాయి. అందంగా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్లు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్లలోని విశేషాలను గమనిస్తే టచ్ స్ర్కీన్ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్లను స్లైడింగ్ క్వర్టీ కీప్యాడ్‌తో రూపొందించారు. ఈ ఫోన్ల డిస్‌ప్లే సామర్థ్యాన్ని పరిశీలిస్తే డ్రాయిడ్ 2(3.7 ), డ్రాయిడ్ 3(4.0)విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి.
శక్తి వంతమైన డ్యూయల్ కోర్ ప్రోసెసర్ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్లు ఆండ్రాయిండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లాట్ ఫాం పై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ పై డ్రాయిడ్ 3 నడుస్తుండగా, ఫ్రోయో వర్సన్‌తో ఆండ్రాయిడ్ 2 నడుస్తుంది. మల్టీ మీడియాకు సంబంధించిన అంశాలను సపోర్టు చేసే ఈ స్మార్టు ఫోన్లలో ఆడియో, విడియో, ప్లే బ్యాక్, రికార్డింగ్ లను ఉన్నత ప్రమాణాలతో తీర్చీదిద్దారు. హై డెఫినిషన్ వంటి నూతన ప్రమాణాలను ఈ ఫోన్లలో పొందుపరిచారు. 8 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగిన డ్రాయిడ్ 3 నాణ్యమైన ఫోటోలతో పాటు వీడియోలు రికార్డు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. 5 మోగా పిక్సల్ సామర్ధ్యం కలిగిన డ్రాయిడ్ 2720పీ రికార్గింగ్ సామర్ధ్యం కలిగిఉంటుంది.
ఇంటెర్ నెట్, బ్లూటూత్, వై ఫై , జీపీఆర్ఎస్, ఎడ్జ్,హై స్పీడ్ త్రీజీ ఇంటర్ నెట్ వంటి అత్యాధునిక అంశాలు ఈ ఫోన్లలో ఇమిడి ఉన్నాయి.16 జీబీ సామర్థ్యం కలిగిన డ్రాయిడ్ 3, 8 జీబీ సామర్థ్యం కలిగిన డ్రాయిడ్ 2 ఫోన్లు మైక్రో ఎస్ డీ ఎక్స్ పేనిషన్ ద్వారా జీబీ సామర్ధ్యాన్ని 32కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. వీటి ధరల విషయానికొస్తే డ్రాయిడ్ 2 ధర రూ.35000 ఉండగా , డ్రాయిడ్ 3 ధర రూ.38900లు పలుకుతుంది.స్మార్ట్ మొబైల్ కొందామనుకుంటున్న సెల్ ప్రియులకు అత్యాధునికతో పాటు అదనపు ఆకర్షణలు కల్సిస్తున్న డ్రాయిడ్ 3 ద బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








