మోత మ్రోగించడానికి వస్తున్నా...

Posted By: Staff

మోత మ్రోగించడానికి వస్తున్నా...

మోటరోలా కొత్తగా మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్ మోటరోలా డబ్ల్యు‌ఎక్స్ 306ని విడుదల చేసింది. ఎవరైతే యూజర్స్ రెండు నెట్ వర్క్‌లను వాడాలని అనుకుంటారో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకోని ఈ మొబైల్‌ని రూపొందించడం జరిగిందని అన్నారు. మోటరోలా అధికార ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం మోటరోలా విడుదల చేసిన ఈ కొత్త మొబైల్ బెస్ట్ సర్వీస్‌ని అందించడంతో పాటు నెట్ వర్క్‌లకు కూడా చక్కగా పని చేస్తుందని తెలిపారు. ఒక మొబైల్ నెంబర్ పర్సనల్‌గా వాడుకున్నప్పటికీ, మరోక మొబైల్ నెంబర్ ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లేక స్టూడెంట్స్‌కి ఇంటర్యూలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

మరొక ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే రెండు సిమ్ కార్డుల ఉన్నప్పటికీ ఒక సిమ్ కార్డ్ స్లాట్ మాత్రం 3జీ నెట్ వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది. మోటరోలా డబ్ల్యు‌ఎక్స్ 306 మొబైల్ మోటరోలా కంపెనీ విడుదల చేసిన బేసిక్ హ్యాండ్ సెట్ విభాగంలోకి వస్తుంది. ఇందులో ఉన్న కెమెరా సహాయంతో హై రిజల్యూషన్ ఇమేజిలను, వీడియోలను తీయవచ్చు. మోటరోలా డబ్ల్యు‌ఎక్స్ 306 మొబైల్‌లో మొమొరీని విస్తరించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ సహాయంతో మీకు నచ్చిన పాటలను వినడమే కాకుండా మీకు నచ్చిన పాటని రింగ్ టోన్‌గా కూడా పెట్టుకోవచ్చు.

కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ ఫెసిలిటీని నిక్షిప్తం చేయడం జరిగింది. దీని సహాయంతో పాటలను, డేటాని స్నేహితులకు ట్రాన్పర్ చేయవచ్చు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఇందులో మ్యూజిక్ ప్లేయర్‌తో పాటు ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. దీని సహాయంతో ఎఫ్‌ఎమ్ న్యూస్‌ని వినవచ్చు. పవర్ విషయానికి వస్తే బ్యాటరీ బ్యాక్ అప్ కూడా ఎక్కువ కాలం వస్తుంది. మార్కెట్లో దీని ధర కూడా చాలా తక్కువగా నిర్ణయించడం జరిగింది. ఎంత అని అనుకుంటున్నారా కేవలం రూ 3, 500 మాత్రమే.

మోటరోలా డబ్ల్యు‌ఎక్స్ 306 ఫీచర్స్:

* Dual Sim(GSM+GSM)
* 3G networks
* FM Radio
* Camera
* Music Player
* Bluetooth

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot