మద్యతరగతి ఫ్యామిలీల కోసం మోటరోలా డ్యూయల్ సిమ్ పోన్స్

Posted By: Staff

మద్యతరగతి ఫ్యామిలీల కోసం మోటరోలా డ్యూయల్ సిమ్ పోన్స్

దేశీయ మొబైల్ దిగ్గజం మోటరోలా ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను టార్గెట్ చేసుకొని మార్కెట్లోకి మూడు డ్యూయల్ సిమ్ మొబైల్స్‌ని విడుదల చేయనుంది. ఆ మూడు మొబైల్స్ కూడా మోటరోలా EX సిరిస్ నుండి వెలువడనున్నాయి. వాటిపేర్లు EX 212, EX 119, EX 109గా నామకరణం చేయడమైంది. మోటరోలా కంపెనీ ఇండియాలో డ్యూయల్ సిమ్ ఫోన్స్ కి మంచి డిమాండ్ ఉండబట్టే మార్కెట్లోకి ఈ మూడు మొబైల్స్‌ని విడుదల చేయడం జరుగుతుందని మోటరోలా ప్రతినిధులు తెలిపారు. మోటరోలా ఇండియన్ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా మంచి డిజైన్స్ కలిగిన మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. వీటి ధర కూడా కేవలం రూ 3,500 నుండి రూ 6,190 వరకు ఉండవచ్చు. త్వరలోనే ఇండియాలో ఉన్న అన్నిలీడింగ్ స్టోర్స్ లలోను ఇవి లభ్యం కానున్నాయి.

గతంలో మోటరోలా కంపెనీ నుండి వచ్చిన Motorola RAZR మాదరే Motorola EX 212 ఉంటుంది. దీని ధర రూ 5,190గా నిర్ణయిండమైంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే 2 మెగా పిక్సల్ కెమెరాని కలిగి ఉండి, ఎఫ్ ఎమ్ రేడియోతో పాటు, యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2.4 ఇంచ్ టిఎప్‌టి కలిగి ఉంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీని అందిస్తున్నప్పటికీ మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీనిీ 16జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

మోటరోలా EX 119 ఫీచర్స్ విషయానికి వస్తే క్వర్టీ కీప్యాడ్‌తో పాటు టచ్ ఫెసిలిటీని కూడా కలిగి ఉంది. దీనియొక్క స్క్రీన్ సైజు 2.4 ఇంచ్ విజిఎ డిస్ ప్లేతోపాటు QVGA టచ్ స్క్రీన్ దీని సొంతం. 3 మెగా ఫిక్సల్ కెమెరాతో చూడచక్కని ఇమేజిలను, వీడియోలను తీయవచ్చు. కనెక్టివిటీ కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీని అందిస్తున్నప్పటికీ మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మోటరోలా EX 119 ధర సుమారుగా రూ 6,190గా నిర్ణయిండమైంది.

ఇక మూడవ మొబైల్ మోటరోలా EX109 కూడా క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉంది. దీని ధర మాత్రం మిగిలిన రెండు మొబైల్స్‌తో పొల్చితే చాలా తక్కువ. 2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి యూజర్స్‌కు చక్కని ఇమేజి ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. మంచి సౌండ్ క్లారిటితో ఆడియో సాంగ్స్ వినేందుకు ఇందులో ఎప్ ఎమ్ రేడియో ప్రత్యేకం. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్ వర్సన్ 2.1ని సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీని అందిస్తున్నప్పటికీ మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మోటరోలా EX 109 ధర సుమారుగా రూ3,590గా నిర్ణయిండమైంది.

ఈ మూడు మొబైల్స్‌ని కూడా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి కారణం మద్యతరగతి కుటుంబాల ఆదాయాన్నిదృష్టిలో పెట్టుకోవడమే. గతంలో నోకియా కూడా ఇలానే డ్యూయల్ సిమ్ మొబైల్ మోడల్స్‌‌ని ఇలానే విడుదల చేయడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot