Home
Mobile

ఈ మోటోరోలా Edge ఫోన్ పై రూ. 5000 ధర తగ్గింది! కొత్త ధర వివరాలు

By Maheswara

Motorola Edge 40 భారతదేశంలో లాంచ్ అయిన వెంటనే గత సంవత్సరం లాంచ్ అయిన మోటోరోలా ఫోన్ భారీ ధర తగ్గింపుని ప్రకటించింది. మోటోరోలా యొక్క కొత్త ఎడ్జ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ తర్వాత మోటరోలా ఎడ్జ్ 30 ఫోన్ పై భారీ ధర తగ్గింపును ప్రకటించారు. ఆఫర్ ధర వివరాలు చూద్దాం.

మోటోరోలా Edge 30 కొత్త ధర వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో భారతదేశంలో లాంచ్ చేయబడింది. అయితే, ఈ Motorola Edge 30 యొక్క 8GB RAM ఆప్షన్ ఫోన్ యొక్క ధరను మాత్రమే తగ్గించింది. కొన్ని నిల్వ ఎంపికలపై రూ.5000 తగ్గింపును ప్రకటించారు.

Motorola Edge 30 Price Cut By Rs.5000 In India, After New Phone Motorola Edge 40 Launch. Offer Price Details.

ఒకసారి గుర్తుకు చేసుకుంటే, మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB RAM ఎంపిక యొక్క అసలు ధర రూ. 29,999. ఇక ఆఫర్ ద్వారా రూ. 5,000 ధర తగ్గింపు తర్వాత, మోటో ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ రూ. 24,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది అరోరా గ్రీన్ మరియు మెటోర్ గ్రే అనే 2 రంగుల ఎంపికలలో అందించబడుతుంది.

మోటోరోలా Edge 30 ఫీచర్లు: మోటోరోలా Edge 30 స్మార్ట్‌ఫోన్ 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. మృదువైన స్క్రోలింగ్ అనుభవాన్ని అందించడానికి డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంది.

మోటోరోలా Edge 30 స్మార్ట్ ఫోన్ 8GB వరకు RAMతో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778+ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ను కూడా అందిస్తుంది, ఇంకా మైక్రో SD కార్డ్‌ని జోడించడం ద్వారా స్టోరేజీ విస్తరించవచ్చు.

ఆండ్రాయిడ్ 12 OS తో పనిచేసే మోటోరోలా ఎడ్జ్ 30 కంపెనీ యొక్క MyUX ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ IP52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది, ఇది స్మార్ట్‌ఫోన్‌ను "వాటర్ స్ప్లాష్" (స్ప్లాష్ రెసిస్టెన్స్) నుండి రక్షిస్తుంది.

5G సపోర్ట్‌తో వస్తున్న మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది f/1.8 ఎపర్చరుతో 50MP మెయిన్ సెన్సార్ + f/2.2 ఎపర్చరుతో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా + f/2.2 ఎపర్చర్‌తో 2MP డెప్త్ సెన్సార్‌ని కలిగి ఉంది.

ఇక ముందు వైపు కెమెరా విషయానికి వస్తే, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. మోటరోలా ఎడ్జ్ 30లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇక చివరగా ఇది 33W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4020mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Motorola Edge 40 స్మార్ట్‌ఫోన్, మంగళవారం (23-5-2023) భారతదేశంలో లాంచ్ అయింది. ముఖ్యంగా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక ఫీచర్లతో వచ్చింది.Motorola Edge 40 స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 256GB స్టోరేజీతో రూ.29,999. ప్రత్యేకంగా, ఈ ఫోన్ మే 30న ఫ్లిప్‌కార్ట్ మరియు మోటరోలా వెబ్‌సైట్‌లో సేల్ కు రాబోతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 30 Price Cut By Rs.5000 In India, After New Phone Motorola Edge 40 Launch. Offer Price Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X