Motorola 200 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్‌.. భార‌త్‌లో విడుద‌ల‌కు సిద్ధం!

|

Motorola కంపెనీ భారతదేశంలో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రింప‌జేస్తోంది. త్వ‌ర‌లో మ‌రో కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను కూడా విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే ఎడ్జ్ సిరీస్ లో భాగంగా అనేక ప్రీమియం మొబైల్స్‌ను విడుద‌ల చేసిన ఈ కంపెనీ, త్వరలో భారతదేశంలో కూడా ఈ సిరీస్ నుంచి కొత్త మొబైల్‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది. Motorola Edge 30 Ultra మోడ‌ల్ సెప్టెంబర్ 10న భారతదేశంలో లాంచ్ అవుతుందని తాజాగా తాజాగా ఓ టిప్‌స్ట‌ర్ ద్వారా వెల్ల‌డైంది.

 
Motorola 200 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్‌.. భార‌త్‌లో విడుద‌ల‌కు సిద్ధం!

Motorola Edge 30 Ultra విడుద‌లకు సంబంధించిన వివ‌రాలు:
ప్రస్తుతం, Motorola ఇండియా Motorola Edge 30 Ultra లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ కొత్త మోటో ఫ్లాగ్‌షిప్ లాంచ్‌ను నిర్ధారిస్తూ ఫ్లిప్‌కార్ట్ పోస్టర్‌ను షేర్ చేశారు. Motorola Edge 30 Ultra సెప్టెంబర్ 10వ తేదీన‌ మధ్యాహ్నం 1 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు.

ఇప్పటికే ఈ Motorola Edge 30 Ultra గ్లోబల్ మార్కెట్‌లో విడుద‌లైంది. ఈ తాజా లీకులు నిజమైతే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ సమయంలో కొత్త Motorola Edge 30 Ultra అమ్మకానికి వస్తుందని కూడా అంద‌రూ భావిస్తున్నారు.

Motorola Edge 30 Ultra ఫీచ‌ర్లు(ఎక్స్‌పెక్టెడ్‌):
ఫ్లిప్‌కార్ట్ పోస్టర్‌లో హైలైట్ చేయబడిన వివ‌రాల ప్ర‌కారం చూస్తే.. ఈ Motorola Edge 30 Ultra కు కెమెరా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి 200MP కెమెరా అందిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇది భారీ కెమెరా సెన్సార్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది.

Motorola Edge 30 Ultra గ్లోబల్ మార్కెట్లో ఇప్ప‌టికే లాంచ్ చేయబడింది. గ్లోబ‌ల్‌గా లాంచ్ అయిన డివైజ్ ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి. ఇది FHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ర్యామ్ మ‌రియు స్టోరేజీ విష‌యానికొస్తే.. 12GB వరకు LPDDR5 RAM మరియు 512GB UFS 3.1 స్టోరేజీని అందించారు. Motorola Edge 30 Ultra బ్యాక్‌సైడ్‌ 200MP ప్రైమరీ సెన్సార్‌ను OIS మద్దతుతో సహా అధునాతన ఫీచర్‌లతో క‌లిగి ఉంది. దాంతోపాటుగా, 12MP టెలిఫోటో షూటర్ మరియు 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మద్దతు ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 60MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

Motorola Edge 30 Ultra మొబైల్ 5,000 mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. దాంతో పాటుగా, 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో క‌లిగి ఉంది. ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై మొదలైన సాధారణ భద్రత మరియు కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. భారతీయ వేరియంట్‌కు కూడా ఇదే మాదిరి ఫీచ‌ర్ల‌ను ఆశించవచ్చు.

 
Motorola 200 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్‌.. భార‌త్‌లో విడుద‌ల‌కు సిద్ధం!

అదేవిధంగా, భార‌త్‌లో ఇప్ప‌టికే విడుద‌లైన Motorola Edge 30 మొబైల్ గురించి కూడా తెలుసుకుందాం:

Motorola Edge 30 స్పెసిఫికేష‌న్లు:
Motorola Edge 30 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో 144hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో వస్తుంది. డిస్ప్లే HDR10+, DC-Dimmingకి కూడా మద్దతు ఇస్తుంది మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్‌తో వస్తుంది.ఈ ఫోన్ Qualcomm Snapdragon 778+ 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇంకా ఈ ఫోన్ భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 778+ 5g ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌సెట్ Qualcomm Snapdragon 778కి సక్సెసర్. Motorola Edge 30 ఫోన్ 6GB+128GB స్టోరేజ్ మరియు 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ వంటి రెండు RAM వేరియంట్‌లలో వస్తుంది. మరియు, Edge 30 ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది.

Motorola 200 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్‌.. భార‌త్‌లో విడుద‌ల‌కు సిద్ధం!

ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 4020mAh బ్యాటరీ ఉంది. ఇంకా ,Motorola Edge 30 భారతదేశపు మొట్టమొదటి 50 MP హై రిజల్యూషన్ అల్ట్రావైడ్ + మాక్రో కెమెరా, OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ పరికరంలో స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి, ఇవి డాల్బీ అట్మోస్‌తో వస్తాయి మరియు అత్యంత లీనమయ్యే మరియు Noise Less ఆడియో అనుభవం కోసం స్నాప్‌డ్రాగన్ సౌండ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ Motorola Edge 30 మొబైల్ 8జీబీ ర్యామ్ వేరియంట్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999 కి అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Motorola Edge 30 Ultra Launching Soon; 200MP Cameras, Snapdragon 8+ Gen1 SoC Confirmed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X