ఫొటో ప్రియుల‌కు ఇక పండగే.. Motorola ఫ్లాగ్‌షిప్ ఫోన్ వ‌చ్చేసింది!

|

ఫొటోగ్ర‌ఫీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. Motorola కంపెనీ యొక్క 200 మెగాపిక్సెల్ కెమెరా క‌లిగిన ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ ఎట్ట‌కేల‌కు భార‌త మార్కెట్లో లాంచ్ అయింది. Motorola Edge 30 Ultra పేరుతో రూపొందించిన ఈ మొబైల్‌ను కంపెనీ మంగ‌ళ‌వారం భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. దీంతో పాటుగా మ‌రో కొత్త మోడ‌ల్ Motorola Edge 30 Fusion మొబైల్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ రెండు మోడ‌ల్స్ ఇప్ప‌టికే అంతర్జాతీయంగా ప‌లు ఎంపిక చేసిన మార్కెట్లలో అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే.

 
ఫొటో ప్రియుల‌కు ఇక పండగే.. Motorola ఫ్లాగ్‌షిప్ ఫోన్ వ‌చ్చేసింది!

Motorola Edge 30 Ultra అనేది 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉన్న ఫ్లాగ్‌షిప్ మొబైల్‌. మరియు ఇది Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ద్వారా శక్తిని పొందుతుంది. మోటరోలా తాజా స్మార్ట్‌ఫోన్‌కు 125W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుందని, ఇది ఇప్పటివరకు వేగవంతమైన టర్బోపవర్ ఛార్జింగ్ అందిస్తున్న‌ట్లు పేర్కొంది. మ‌రోవైపు, Motorola Edge 30 Fusion మొబైల్ Qualcomm Snapdragon 888+ SoC ద్వారా శక్తిని పొందుతుంది.

భార‌త్‌లో Motorola Edge 30 Ultra మొబైల్స్ ధరలు, లభ్యత:

భార‌త్‌లో Motorola Edge 30 Ultra మొబైల్స్ ధరలు, లభ్యత:

* భారతదేశంలో Motorola Edge 30 Ultra మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.59,999 గా నిర్ణ‌యించారు. ఇది ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ మరియు స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సందర్భంగా ఈ కొత్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద రూ.54,999 ధ‌ర‌కే అందించ‌నున్నారు.

ఇక Motorola Edge 30 Ultra తో ఉన్న ఇతర ఆఫర్‌లలో జియో నుంచి రూ.100 విలువైన 40 రీఛార్జ్ వోచర్‌లు మొత్తం రూ.4,000 క్యాష్‌బ్యాక్ రూపంలో పొంద‌వ‌చ్చు. Myntra, Zee5, OYO, Ixigo మరియు Ferns & Petals నుండి రూ.10,699 విలువైన వోచర్‌లు కూడా ఆఫ‌ర్లో ఉన్నాయి.

భార‌త్‌లో Motorola Edge 30 Fusion మొబైల్స్ ధరలు, లభ్యత:
 

భార‌త్‌లో Motorola Edge 30 Fusion మొబైల్స్ ధరలు, లభ్యత:

* భారతదేశంలో Motorola Edge 30 Fusion మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌రను రూ.42,999 గా నిర్ణ‌యించారు. ఇది కాస్మిక్ గ్రే మరియు సోలార్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ను రూ.39,999 కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Motorola Edge 30 Fusionతో ఉన్న ఇతర ఆఫర్లలో జియో నుంచి రూ.100 విలువైన 40 రీఛార్జ్ వోచర్‌ల రూపంలో 4,000 క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు. అదేవిధంగా ప‌లు భాగ‌స్వామి కంపెనీల నుంచి Myntra, Zee5, OYO, Ixigo మరియు Ferns & Petals రూ.3,699 విలువైన వోచ‌ర్‌లు పొంద‌వ‌చ్చు. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిలయన్స్ డిజిటల్‌తో సహా ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది FHD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్‌తో, కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. ఈ డివైజ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఎడ్జ్ లైటింగ్‌తో వస్తుంది. డిస్ప్లే ముందు మరియు వెనుక రెండింటిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ర్యామ్ మ‌రియు స్టోరేజీ విష‌యానికొస్తే.. 8GB వరకు LPDDR5 RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజీని అందించారు.

కెమెరా ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌:

కెమెరా ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌:

ఫోటోలు మరియు వీడియోల కోసం, Motorola Edge 30 Ultra మొబైల్‌కు బ్యాక్‌సైడ్‌ 200-మెగాపిక్సెల్ Samsung సెన్సార్ (0.64 µm పిక్సెల్ పరిమాణం)తో వస్తుంది, అది f/1.9 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడింది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని పొందుతుంది. ఇది బాగా ప్ర‌కాశ‌వంత‌మైన ఫోటోలను అందించడానికి ఎక్కువ లైటింగ్‌ను తీసుకుంటుంది. రెండవది 50-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ సెన్సార్, ఇది అల్ట్రా-వైడ్ యాంగిల్ f/2.2 ఎపర్చరు లెన్స్‌తో జత చేయబడింది. కెమెరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, 114 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది మరియు మాక్రో షాట్‌లను క్యాప్చర్ చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. మూడవ కెమెరా, 12-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ f/1.6 ఎపర్చరు టెలిఫోటో లెన్స్‌తో జత చేయబడింది, ఇది 2x జూమ్‌ను అందిస్తుంది మరియు పోర్ట్రెయిట్ షాట్‌లను క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 60MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

Motorola Edge 30 Ultra మొబైల్ 4,610 mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. దాంతో పాటుగా, 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో క‌లిగి ఉంది. ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై మొదలైన సాధారణ భద్రత మరియు కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇతర ఫీచర్లలో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్, డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేయబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు లీనియర్ x-యాక్సిస్ వైబ్రేషన్ ఉన్నాయి. Motorola 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు మూడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లను (Android 13,14 మరియు 15) అందిస్తోంది. ఇక ఓఎస్ విష‌యానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత My UX skin పై ర‌న్ అవుతుంది.

Motorola Edge 30 Fusion స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Fusion స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Fusion స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) కర్వ్డ్ ఎండ్‌లెస్ ఎడ్జ్ POLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ HDR10+ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. మరియు 1,100 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888+ SoC ద్వారా 8GB LPDDR5 RAMతో జత చేయబడింది.

ఫోటోగ్రఫీ కోసం, Motorola Edge 30 Fusion 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/1.8 ఎపర్చరు లెన్స్‌తో జత చేయబడింది. 120-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉన్న అల్ట్రా-వైడ్ యాంగిల్ f/2.2 ఎపర్చరు లెన్స్‌తో జతచేయబడిన 13-మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది, అది f/2.45 ఎపర్చరు లెన్స్‌తో జత చేయబడింది.

Motorola Edge 30 Fusion స్టోరేజీ విష‌యానికొస్తే.. 128GB UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని క‌లిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6E, 5G, 4G LTE, బ్లూటూత్ v5.2, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. హ్యాండ్‌సెట్ 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

 

Best Mobiles in India

English summary
Motorola Edge 30 Ultra , Motorola Edge 30 Fusion Launched in India 200 megapixel camera

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X