Motorola యొక్క 200MP స్మార్ట్ ఫోన్ మరింత కొత్తగా వచ్చేసింది!

|

Motorola కంపెనీ గత నెలలో Motorola Edge 30 Ultra పేరుతో 200 మెగాపిక్సెల్ కెమెరా క‌లిగిన ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ ను భార‌త మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ ఈ మొబైల్ కు సంబంధించి మరో వేరియంట్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Motorola Edge 30 Ultra భారతదేశంలో 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మంగళవారం ప్రారంభించబడింది. గతంలో ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

Motorola

Motorola Edge 30 Ultra అనేది 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉన్న ఫ్లాగ్‌షిప్ మొబైల్‌. మరియు ఇది Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ద్వారా శక్తిని పొందుతుంది. మోటరోలా తాజా స్మార్ట్‌ఫోన్‌కు 125W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుందని, ఇది ఇప్పటివరకు వేగవంతమైన టర్బోపవర్ ఛార్జింగ్ అందిస్తున్న‌ట్లు పేర్కొంది.

భార‌త్‌లో Motorola Edge 30 Ultra మొబైల్స్ ధరలు, లభ్యత:

భార‌త్‌లో Motorola Edge 30 Ultra మొబైల్స్ ధరలు, లభ్యత:

* భారతదేశంలో Motorola Edge 30 Ultra మొబైల్ యొక్క తాజా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.64,999 గా నిర్ణ‌యించారు. ఇది ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ మరియు స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది.

గతంలో విడుదలైన 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లో రూ.59,999 గా నిర్ణయించబడింది. కానీ, అది కూడా ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్లో రూ.54,999 కి జాబితా చేయబడింది.

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది FHD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్‌తో, కర్వ్డ్ POLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. ఈ డివైజ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఎడ్జ్ లైటింగ్‌తో వస్తుంది. డిస్ప్లే ముందు మరియు వెనుక రెండింటిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ర్యామ్ మ‌రియు స్టోరేజీ విష‌యానికొస్తే.. 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB స్టోరేజీని అందించారు.

కెమెరా ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌:

కెమెరా ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌:

ఫోటోలు మరియు వీడియోల కోసం, Motorola Edge 30 Ultra మొబైల్‌కు బ్యాక్‌సైడ్‌ 200-మెగాపిక్సెల్ Samsung సెన్సార్ (0.64 µm పిక్సెల్ పరిమాణం)తో వస్తుంది, అది f/1.9 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడింది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని పొందుతుంది. ఇది బాగా ప్ర‌కాశ‌వంత‌మైన ఫోటోలను అందించడానికి ఎక్కువ లైటింగ్‌ను తీసుకుంటుంది. రెండవది 50-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ సెన్సార్, ఇది అల్ట్రా-వైడ్ యాంగిల్ f/2.2 ఎపర్చరు లెన్స్‌తో జత చేయబడింది. కెమెరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, 114 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది మరియు మాక్రో షాట్‌లను క్యాప్చర్ చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. మూడవ కెమెరా, 12-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ f/1.6 ఎపర్చరు టెలిఫోటో లెన్స్‌తో జత చేయబడింది, ఇది 2x జూమ్‌ను అందిస్తుంది మరియు పోర్ట్రెయిట్ షాట్‌లను క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 60MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు;

125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు;

Motorola Edge 30 Ultra మొబైల్ 4,610 mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. దాంతో పాటుగా, 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో క‌లిగి ఉంది. ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై మొదలైన సాధారణ భద్రత మరియు కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇతర ఫీచర్లలో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్, డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేయబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు లీనియర్ x-యాక్సిస్ వైబ్రేషన్ ఉన్నాయి. Motorola 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు మూడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లను (Android 13,14 మరియు 15) అందిస్తోంది. ఇక ఓఎస్ విష‌యానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత My UX skin పై ర‌న్ అవుతుంది.

 

Best Mobiles in India

English summary
Motorola Edge 30 Ultra new 12GB RAM/256GB storage variant launched.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X