Motorola 200MP కెమెరా మొబైల్ వ‌చ్చేసింది.. భార‌త్‌లో ఎప్పుడంటే!

|

Motorola కంపెనీ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ మొబైల్ Motorola Edge 30 Ultra ను యూర‌ప్ మార్కెట్లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో, 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో వ‌స్తోంది.

Motorola

అంతేకాకుండా, ఇది Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ద్వారా శక్తిని పొందుతుంది. మోటరోలా తాజా స్మార్ట్‌ఫోన్‌కు 125W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్టును క‌ల్పిస్తుంద‌ని, ఇది ఇప్పటివరకు వేగవంతమైన టర్బోపవర్ ఛార్జింగ్ అని కంపెనీ పేర్కొంది. ఫోన్ యొక్క ఇతర లక్షణాలలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67-అంగుళాల పూర్తి-HD+ pOLED డిస్‌ప్లేను దీనికి అందిస్తున్నారు. నోటిఫికేషన్, ఇన్‌కమింగ్ ఫోన్ కాల్ లేదా షెడ్యూల్ చేయబడిన అలారం గురించి వినియోగదారులకు తెలియజేయడానికి ఎడ్జ్ లైట్లు ఫీచ‌ర్ క‌ల్పించారు.

Motorola Edge 30 Ultra ధ‌ర:
Motorola Edge 30 Ultra ఏకైక 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ కోసం EUR 899 (దాదాపు రూ. 72,150)గా నిర్ణయించబడింది. Motorola ఫోన్ ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ మరియు స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అర్జెంటీనా, బ్రెజిల్ మరియు యూరప్‌లలో అమ్మకానికి వచ్చింది. Motorola Edge 30 Ultra రాబోయే వారాల్లో లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆసియాలోని ఎంపిక చేసిన మార్కెట్లలో విడుదల చేయబడుతుంది.

Motorola

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్లు:
Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది FHD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ర్యామ్ మ‌రియు స్టోరేజీ విష‌యానికొస్తే.. 12GB వరకు LPDDR5 RAM మరియు 256జీబీ స్టోరేజీని అందించారు.

ఫోటోలు మరియు వీడియోల కోసం, Motorola Edge 30 Ultra 1/1.22-అంగుళాల 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ (0.64 µm పిక్సెల్ పరిమాణం)తో వస్తుంది, అది f/1.9 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడింది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని పొందుతుంది. ఇది ఎక్కువ బ్రైట్‌నెస్‌తో మంచి క్లారిటీ క‌లిగిన‌ ఫోటోలను అందిస్తుంది. అల్ట్రా-వైడ్ యాంగిల్ f/2.2 ఎపర్చరు లెన్స్‌తో జతచేయబడిన 50-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 12-మెగాపిక్సెల్ సెన్సార్ f/1.6 ఎపర్చరు టెలిఫోటో లెన్స్‌తో జత చేయబడింది, ఇది 2x జూమ్‌ను అందిస్తుంది మరియు పోర్ట్రెయిట్ షాట్‌లను క్యాప్చర్ చేస్తుంది.

Motorola Edge 30 Ultra మొబైల్‌కు 4,610mAh బ్యాటరీని 125W TurboPower వైర్డ్ ఛార్జింగ్, 50W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W వైర్‌లెస్ పవర్ షేరింగ్‌తో త‌యారుచేశారు. ఇతర ఫీచర్లలో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్, డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేయబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు, లీనియర్ x-యాక్సిస్ వైబ్రేషన్ స‌హా మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను అందించారు.

భార‌త్‌లో ఈ Motorola Edge 30 Ultra విడుద‌లకు సంబంధించిన వివ‌రాలు:
ప్రస్తుతం, Motorola ఇండియా Motorola Edge 30 Ultra లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ కొత్త మోటో ఫ్లాగ్‌షిప్ లాంచ్‌ను నిర్ధారిస్తూ ఫ్లిప్‌కార్ట్ పోస్టర్‌ను షేర్ చేశారు. Motorola Edge 30 Ultra సెప్టెంబర్ 10వ తేదీన‌ మధ్యాహ్నం 1 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఈ తాజా లీకులు నిజమైతే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ సమయంలో కొత్త Motorola Edge 30 Ultra అమ్మకానికి వస్తుందని కూడా అంద‌రూ భావిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Motorola Edge 30 Ultra With 200-Megapixel Main Sensor, Launched: Price, Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X