50MP సోనీ కెమెరా, IP68 రేటింగ్, 3D కర్వడ్ డిస్‌ప్లే, టర్బో పవర్ ఛార్జింగ్ ఫోన్ పై డిస్కౌంట్!
Motorola Edge 50 Fusion Smartphone : మోటోరోలా ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ను భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో ముఖ్యంగా ఎడ్జ్ 60 సిరీస్‌తోపాటు G సిరీస్ మోడల్స్ ఉన్నాయి. ఇటీవలే G సిరీస్ నుంచి మోటోరోలా G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే గత సంవత్సరం విడుదల అయిన మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ డిజైన్ సహా స్పెసిఫికేషన్‌లు ఆకట్టుకొనే అవకాశం ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.24999 గా ఉండేది.

రూ.18999 ప్రారంభ ధరకే :
ప్రస్తుతం రూ.4 వేల డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.18999, రూ.20999 గా ఉన్నాయి. ఈ ఫోన్ మార్స్‌మల్లో బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, హాట్ పింక్, ఫారెస్ట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
3D కర్వడ్ డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ pOLED 3D కర్వడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. Adreno 710 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు తో 50MP సోనీ LYT - 700C ప్రైమరీ కెమెరా ను కలిగి ఉంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
IP68 రేటింగ్, 5000mAh బ్యాటరీ :
ఈ మోటోరోలా ఫోన్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మోటో కనెక్ట్ ఫ్యామిలీ స్పేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.2, వైఫై, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ ఫ్రూఫ్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








