Home
Mobile

వాటర్‌ ప్రూఫ్‌, 50MP సోనీ కెమెరా, 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.21999..!

మోటోరోలా ఎడ్జ్‌ 50 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లు ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. గత సంవత్సరం మే నెలలో విడుదల అయిన మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ ను (Motorola Edge 50 Fusion Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 6.7 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మూడు కలర్ వేరియంట్స్‌లో ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్ల వివరాలు :
మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) ఈ స్మార్ట్‌ఫోన్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21,999, అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion 5G Smartphone

దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. మరియు కెనరా బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అదే కెనరా బ్యాంకు క్రెడిట్‌ కార్డు EMI ట్రాన్సాక్షన్‌ చేస్తే రూ.1,500 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ ఫారెస్ట్‌ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్‌, హాట్ పింక్‌, మార్స్‌మల్లో బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల FHD+ pOLED 3D కర్వడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను కలిగి ఉంటుంది. మోటో కనెక్ట్‌, ఫ్యామిలీ స్పేస్‌ వంటి ఫీచర్‌ లను కలిగి ఉంది.

Motorola Edge 50 Fusion 5G Smartphone

సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఎడ్జ్‌ 50 ఫ్యూజర్‌ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ ను సపోర్టు ఉంది. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.

4 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు :
ఈ మోటో హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Adreno 710 GPU మరియు 12GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌ లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందనుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజర్‌ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు ఈ ఫోన్‌ 68W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌గా ఉంది. 5G, 4G VoLTE, WiFi 802, బ్లూటూత్‌ 5.2, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Fusion 5G Smartphone received price cut on Flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X