50MP కెమెరా, 12GB ర్యామ్ మోటోరోలా 5G స్మార్ట్‌ఫోన్ రెండో సేల్ ప్రారంభం.. రూ.2000 డిస్కౌంట్..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌లోకి మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Fusion second sale on Flipkart) విడుదల అయింది. తొలి సేల్ కూడా నిర్వహించారు. అయితే తాజాగా మరోసారి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది. ఈ రెండో సేల్‌లో భాగంగా ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది మరియు Adreno 710 GPU తో జతచేయబడి ఉంటుంది. 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంటుంది.

మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. 68W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ pOLED 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP LYTIA 700C ప్రధాన కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. 4K నాణ్యతతో 30fps తో వీడియోలను రికార్డు చేయవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో మెరుగైన వాటర్, డస్ రెసిస్టెంట్‌గా విడుదల అయింది. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల వేరియంట్‌లలో లభిస్తుంది. ఫారెస్ట్ బ్లూ, మార్ష్‌మల్లో బ్లూ మరియు హాట్ పింక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా 4G, 5G, వైఫై, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు మోటో కనెక్ట్, మోటో సెక్యూర్, ఫ్యామిలీ స్పెస్, పీసీ సపోర్టు సహా మరిన్ని కనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ బరువు 175 గ్రాములుగా ఉంది. మరియు 7.9mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








