6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా మోటోరోలా స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు...!
మోటోరోలా నుంచి ఇటీవల ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కె్ట్‌లోకి లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion sale is live) 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. ICICI క్రెడిట్ కార్డుల ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 అంగుళాల పుల్ HD+ pOLED 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది.
మోటోరోలా హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP LYTIA 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP ను కలిగి ఉంటుంది. 4K నాణ్యతతో 30fps తో వీడియోలను రికార్డు చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌తో Adreno 710 GPU తో జతచేయబడి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది. మూడు OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 68W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల వేరియంట్‌లలో లభిస్తుంది. ఫారెస్ట్ బ్లూ, మార్ష్‌మల్లో బ్లూ మరియు హాట్ పింక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో మెరుగైన వాటర్, డస్ రెసిస్టెంట్‌గా విడుదల అయింది.
కనెక్టివిటీ పరంగా 4G, 5G, వైఫై, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు మోటో కనెక్ట్, మోటో సెక్యూర్, ఫ్యామిలీ స్పెస్, పీసీ సపోర్టు సహా మరిన్ని కనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ బరువు 175 గ్రాములుగా ఉంది. మరియు 7.9mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








