మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, మెరుగైన వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలు!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ఇటీవల మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ వంటి ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవాళ్టి నుంచి మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, IP68 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తగ్గింపు ధరను పొందవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ (Motorola Edge 50 Neo 5G Smartphone Sale) తొలి సేల్ సెప్టెంబర్ 16న నిర్వహించారు. ఇవాళ రెండో సేల్ ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. HDFC బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
మోటోరోలా ఎడ్జ్ 50 నియో హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల 1.5K pOLED LTPO డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 1200*2670 పిక్సల్ రిజల్యూషన్, 360 టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.
మోటోరోలా నియో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హీలియో UI OS పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. Mali G615 MC2 GPU, LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీతో జతచేయబడింది. హ్యాండ్‌సెట్ ఐదు సంవత్సరాలపాటు OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని మోటోరోలా హామీ ఇచ్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు, f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYTIA 700C కెమెరాను కలిగి ఉంది. 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3X జూమింగ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.4 అపేచర్‌తో 32MP కెమెరాను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో హ్యాండ్‌సెట్ 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యంతో 4310mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MIL- STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో అందుబాటులో ఉంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G SA/NSA, డ్యూయల్ 4G VoTLE, Wi-Fi 802.11ax, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టుతో అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








