మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు లీక్.. పూర్తి వివరాలు..!!
మోటోరోలా నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 40 నియో హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఎడ్జ్ 50 నియో ఫోన్ (Motorola Edge 50 Neo Smartphone) లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటి 7300 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. అయితే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై మోటోరోలా ఎటువంటి ప్రకటన చేయలేదు.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ వివరాలను ytechb.com షేర్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ట్రిపుల్ కెమెరాలతో రానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యుల్ ఎడ్జ్ 50 ప్రో తరహాలో ఉంటుందని తెలుస్తోంది.

మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఇప్పటి వరకు లీకైన వివరాల ఆధారంగా మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ Mali G615 GPU తో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీతో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్ సెట్ 4310mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. బ్లూటూత్ 5.3, NFC కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 171 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది.
లీక్ అయిన వివరాల ఆధారంగా స్మార్ట్‌ఫోన్ పవర్, వాల్యూమ్ బటన్లు కుడివైపున ఉన్నాయి. మరియు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్‌ను కలిగి ఉంటుంది. USB-C ఛార్జింగ్ పోర్టు, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే, మైక్రోఫోన్.. ఫోన్ కింద భాగంలో గుర్తించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, క్రీమ్, గ్రే, రెడ్ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే రంగుల పేర్లలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








