Home
Mobile

256GB స్టోరేజీ, 50MP కెమెరా, IP68 రేటింగ్‌ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ పై రూ.3000 డిస్కౌంట్..!

మోటోరోలా నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart Big Saving Days Sale 2024) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈనెల 20 న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరుతో ప్రత్యేక సేల్‌ ప్రారంభించింది. ఈ సేల్‌ 25 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్‌ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 50 Neo Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ.20,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సె‌స్‌ బ్యాంకు కార్డులపై 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Motorola Edge 50 Neo Smartphone

మరియు యాక్సెస్‌ బ్యాంకు, IDFC బ్యాంకు బ్యాంకు క్రెడిట్‌ కార్డులతో గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే విడుదల ధరలో పోలిస్తే రూ.3000 వరకు డిస్కౌంట్‌ను పొందవ్చచు. పాంటోన్‌ గ్రిసైల్లె, పాంటోన్‌ లాట్లే, పాంటోన్‌ నాటికల్‌ బ్లూ, పాంటోన్‌ poinciana వంటి నాలుగు రంగుల్లో భారత్‌ మార్కెట్‌ అందుబాటులో ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో స్మార్ట్‌ఫోన్‌ 6.4 అంగుళాల 1.5K pOLED LTPO డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 1200*2670 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Mali G615 MC2 GPU చిప్‌సెట్‌, LPDDR4x ర్యామ్‌ మరియు UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హీలియో UI OS ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌ 5 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT-700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరా మరియు 3X జూమింగ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ f/2.4 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 68W టర్బో ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సామర్థ్యాలతో 4310mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. దీంతోపాటు భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్‌లను అమర్చి ఉంది.

ఈ హ్యండ్‌సెట్‌ MIL- STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్‌ 5G SA/NSA, డ్యూయల్‌ 4G VoTLE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi 802, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Neo Smartphone gets price discount on flipkart big saving days sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X