256GB స్టోరేజీ, 50MP సోనీ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్.. ఇవాళే ప్రత్యేక సేల్..!
మోటోరోలా సంస్థ తన ఎడ్జ్ 50 సిరీస్ ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Neo Smartphone Launched) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఎడ్జ్ 50 తరహా డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో అందుబాటులో ఉంది. 1.5k డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మరియు సోనీ LYT కెమెరా సహా మరెన్నో స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ సాయంత్రం ప్రత్యేక సేల్ నిర్వహించనున్నారు.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల 1.5K pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. 1200*2670 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.

మోటోరోలా హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. మరియు Mali G615 MC2 GPU, LPDDR4x ర్యామ్, UFS 3.1 స్టోరేజీతో జతచేయబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OSను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఐదు సంవత్సరాలపాటు OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని మోటోరోలా తెలిపింది.
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు, f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYTIA 700C కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3X జూమింగ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలతో 4K నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.4 అపేచర్, 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో కూడిన 32MP కెమెరాను అమర్చారు.
Meet the #MotorolaEdge50Neo – your ultimate adventure buddy! With MIL-810H durability, shock resistance, and IP68 protection, it's built to last! 🌟
— Motorola India (@motorolaindia) September 16, 2024
Launched with 8+256GB at ₹22,999/-, sale starts 24 Sep @Flipkart, https://t.co/YA8qpSXba4 & leading stores.
#ReadyForAnything
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యంతో 4310mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ అయింది. మరియు MIL- STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoTLE, బ్లూటూత్ 5.3, వైఫై 802.11ax, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. వేగాన్ లెదర్ ఫినిష్‌తో కూడిన నాటికల్ బ్లూ, లాట్టే, గ్రిసైల్, పొయిన్సియానా రంగుల్లో లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 నియో ధర, సేల్:
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 16వ తేదీ) సాయంత్రం 7 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేక సేల్ ప్రారంభం కానుంది. HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ సాధారణ సేల్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








