Home
Mobile

రూ.5 వేల డిస్కౌంట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ 5G స్మార్ట్‌ఫోన్‌..!

మోటోరోలా సంస్థ ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌లో అనేక మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మోటోరోలా బ్రాండ్‌లో ఎడ్జ్‌ సిరీస్‌ ఎంతో ప్రత్యేకంగా ఈ సంవత్సరం మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా నాలుగు మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి.

అయితే గత సంవత్సరం మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్‌ (Motorola Edge 50 Neo Smartphone) విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Motorola Edge 50 Neo pricedrop on flipkart

రూ.5 వేల తగ్గింపు ధరతో :
భారత్‌లో విడుదల సమయంలో మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. అంటే రూ.5 వేల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా ICICI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు.

1.5K డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.4 అంగుళాల 1.5K pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

Motorola Edge 50 Neo pricedrop on flipkart

మీడియాటెక్ డిస్‌ప్లే :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ LPDDR4x ర్యామ్‌, UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు Mali G615 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హీలియో UI OS పైన పనిచేస్తోంది.

OIS ప్రైమరీ కెమెరా, టెలిఫోటో కెమెరా :
ఈ ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాలతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో :
ఈ హ్యాండ్‌సెట్‌ 68W టర్బో ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4310mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ 5 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

డాల్బీ అట్మాస్‌ సపోర్టు :
ఈ ఫోన్‌ మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi 802, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ నాలుగు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Neo Smartphone now available with Rs5000 pricedrop on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X