50MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి కొన్ని నెలల క్రితం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 pro Smartphone) విడుదల అయింది. మిడ్ రేంజ్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. మరియు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ అనేక ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.2250 తగ్గింపును పొందవచ్చు. అదే ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.3000 ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల కర్వడ్ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. DC డిమ్మింగ్ సపోర్టుతో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 125W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సామర్థ్యాంతో 4500mAh బ్యాటరీ కలిగి ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తోంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్ డేట్లు ఇస్తామని మోటోరోలా సంస్థ వెల్లడించింది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు 3X సామర్థ్యంతో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఆటో ఫోకస్ సామర్థ్యంతో కూడిన 50MP సెల్ఫీ కెమెరా ను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ ఎసిటేట్ ఫినిష్ తో కూడిన మూన్‌లైట్ పెర్ల్, లక్సీ లావెండర్, సిలికాన్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో కూడిన బ్లాక్ బ్యూటీ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మూన్ లైట్ పెర్ల్ కలర్ హ్యాండ్‌సెట్ హ్యాండ్ మేడ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్ ట్రాకింగ్, అడ్వాన్సడ్ లాంగ్ ఎక్స్పోజర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ దీంతోపాటు బోకేష్ ఇతర ఫీచర్ల పనితీరును మెరుగుపరిచేందుకు AI ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








