Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 125W ఛార్జర్‌, 12GB ర్యామ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 ధర తగ్గింపు..!

భారత్ మార్కెట్‌ లో మోటోరోలా సంస్థ 2024 ఏప్రిల్‌ నెలలో మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 pro 5G Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ మాన్యుమెంటల్‌ / రిపబ్లిక్‌ డే సేల్‌లో (Flipkart) భాగంగా ఏకంగా రూ.6000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లతోపాటు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందనుంది.

Motorola Edge 50 Pro 5G smartphone

50MP సెల్ఫీ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా మోటోరోలా హ్యాండ్‌సెట్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ సహా 3X జూమ్‌ సామర్థ్యంతో 10MP టెలిఫోటో కెమెరాను అమర్చారు. ముందు వైపు ఆటోఫోకస్‌ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ Pantone ఆధారిత ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌ను అమర్చి ఉంది.

AI ఫీచర్‌లు :
ఈ మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ తో అందుబాటులో ఉంది.

బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్‌ 4500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 8GB ర్యామ్ వేరియంట్‌తో 68W ఛార్జర్‌, 12GB ర్యామ్‌ వేరియంట్‌తో 125W ఛార్జర్‌ను మోటోరోలా అందిస్తోంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ధర, డిస్కౌంట్‌ వివరాలు :
మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 8GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ వేరియంట్‌ విడుదల సమయంలో రూ.35,999 గా ఉండగా.. ప్రస్తుతం రూ.6,000 డిస్కౌంట్‌తో రూ.29,999 కే అందుబాటులో ఉంది.

3 రంగుల్లో లభిస్తుంది :
HDFC క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1,500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌ బ్యూటీ, లక్సీ లావెండర్‌, కెనీల్‌ బే కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Pro 5G smartphone gets huge discount on Flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X