Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 256GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌ పై రూ.4000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

మోటోరోలా నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్‌ లో మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Pro 5G Smartphone) విడుదల అయింది. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రపంచంలోనే తొలిసారిగా Pantone తో కూడిన AI ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉందని విడుదల సమయంలో మోటోరోలా వెల్లడించింది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌ లను కలిగి ఉంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, డిస్కౌంట్‌ వివరాలు :
ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ + 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.31,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999 గా ఉంది.

Motorola Edge 50 Pro 5G Smartphone gets price cut on flipkart December 2024

అదే 12GB ర్యామ్ వేరియంట్ రూ.35,999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31999 ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులో 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌ బ్యూటీ, కెనీల్‌ బే, లక్‌ లావెండర్‌ రంగుల్లో లభిస్తోంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 2712*1220 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు పొందనుందని మోటోరోలా తెలిపింది.

50MP సెల్ఫీ కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 3X జూమింగ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను అమర్చి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఆటోఫోకస్ సామర్థ్యంతో కూడిన 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెంట్‌ ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 8GB ర్యామ్‌ స్మార్ట్‌ఫోన్‌తో 68W ఛార్జర్‌, 12GB ర్యామ్ వేరియంట్‌తో 125W ఛార్జర్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ AI ఫీచర్‌లను కలిగి ఉంది. ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్‌లున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Pro 5G Smartphone gets price cut on flipkart December 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X