Home
Mobile

12GB ర్యామ్‌, 50MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లే 5G ఫోన్ పై రూ.6000 డిస్కౌంట్‌..!

భారత్‌ మార్కెట్‌లో మెటోరోలా నుంచి ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇందులో మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్ ఫోన్‌లు సహా మోటోరోలా Razr 60 అల్ట్రా ఫోన్‌లు ఉన్నాయి. అయితే గత సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల అయిన ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికీ బెస్ట్‌ హ్యాండ్‌సెట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 50MP సెల్ఫీ కెమెరాతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 50 Pro 5G Flipkart Price) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999 గా గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.4 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Motorola Edge 50 Pro 5G

అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.35,999 కు విడుదల అయింది. ప్రస్తుతం రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా రూ.6,000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

డిస్‌ప్లే, చిప్‌సెట్‌ వివరాలు :
మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా Pantone ఆధారిత AI ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు ఉన్నాయి. 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ వేరియంట్‌ 68W ఛార్జర్‌, 12GB ర్యామ్ వేరియంట్‌తో 125W ఛార్జర్‌ను పొందుతుంది.

IP68 రేటింగ్‌ :
మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ లక్స్ లావెండర్‌, కెనీల్‌ బే, బ్లాక్‌ బ్యూటీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Pro 5G smartphone gets Rs6000 discount on Flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X